హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఎక్కడ కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని ఆయా జిల్లా కలెక్టర్లు హరిచందన, మనూ చౌదరి, నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు తగిన నిల్వలను ఉంచి, సమయానికి సరఫరా చేస్తున్నాయని వెల్లడించారు.