TG: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ కీలక మార్పు చోటుచేసుకుంది. శనివారం జరగాల్సిన ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తున్నట్లు శాసనసభ కార్యదర్శి ప్రకటించారు. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు స్పీకర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. సభ యథావిధిగా ఉదయం 10 గంటలకే ప్రారంభమైనప్పటికీ, నేరుగా ఇతర అంశాలపై చర్చ కొనసాగనుంది. ఈ మార్పును ఎమ్మెల్యేలందరూ గమనించాలని కోరారు.