NLG: ఇంట్లో పేకాట ఆడుతున్న జూదరులను మిర్యాలగూడ టూటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీఐ సోమనర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ కాలనీలో ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రూ.9,213 నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.