MDK: మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని డంప్ యార్డ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఛైర్పర్సన్ కానుగు రాధిక-భూపతి రాజు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. మంటలను అదుపు చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బబ్లు తదితరులు పాల్గొని అగ్నిమాపక చర్యలు చేపట్టారు.