MDK: మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ గ్యాస్, ఇంధనం సరఫరాపై భరోసా ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ వినియోగిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టి 134 సిలిండర్లను సీజ్ చేశామని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. మెదక్ జిల్లాలో ఎటువంటి గ్యాస్, ఇంధనం కొరత లేదని, అవసరానికి మించి నిల్వ చేసుకుని ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.