• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘డయేరియాను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలం’

SKLM: డయేరియా అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. సోమవారం జిల్లా సీపీఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నగరంలోని మురికి నీరు, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు, ఆస్పత్రి వ్యర్థాలను శుద్ధి చేయకుండా నాగావళి నదులలో కలపడం వల్ల ప్రజలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు.

March 2, 2026 / 04:04 PM IST

పంచాయతీ కార్మికులకు యూనిఫామ్‌‌‌ల అందజేత

NRML: బండల్ ఖానాపూర్ గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు సర్పంచ్ కళ్యాణి సచిన్ కుమార్ జాదవ్ యూనిఫామ్‌లు అందజేశారు. గ్రామ పరిశుభ్రత కోసం కార్మికులు చేస్తున్న సేవలు అమూల్యమని పేర్కొంటూ,ప్రజలు కూడా పరిశుభ్రత పరిరక్షణలో సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పద్మ ముత్యం, కార్యదర్శి అక్షిత, వార్డు సభ్యులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 04:03 PM IST

వైసీపీ నేతపై ఎస్పీకి మహిళల ఫిర్యాదు

AP: అనంతపురం జిల్లాలో ఓ వైసీపీ నేతపై కొందరు మహిళలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ నేత వడ్డే పెద్దన్న తమ ఫొటోలు తీసి ఇబ్బంది పెడుతున్నాడని, అసభ్యంగా ప్రవర్తిస్తూ, బెదిరిస్తున్నాడని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

March 2, 2026 / 04:03 PM IST

ఘనంగా వికసిత్ భారత్ యువజన పార్లమెంట్

VZM: JNTU–గురజాడ విజయనగరం విశ్వవిద్యాలయంలో మెరా యువ భారత్ సహకారంతో జిల్లా స్థాయి ‘వికసిత్ భారత్ యువజన పార్లమెంట్–2026’ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరై యువతకు క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. యువతే దేశానికి ప్రధాన శక్తి అని, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి వినియోగించాలన్నారు. నేటి యువతే రేపటి నాయకులన్నారు.

March 2, 2026 / 04:02 PM IST

ఇంటర్ పరీక్షలకు 71 మంది గైర్హాజరు

NGKL: కల్వకుర్తి మునిసిపాలిటీ పరిధిలోని 7 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఐదో రోజు సోమవారం జరిగిన గణితం, రాజనీతి, వృక్షశాస్త్రం పరీక్షలకు మొత్తం 1,867 మందికి గాను 1,796 మంది విద్యార్థులు హాజరయ్యారు. 71 మంది గైర్హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ రామ్ రెడ్డి తెలిపారు.

March 2, 2026 / 04:01 PM IST

సమయపాలన పాటించని అంగన్వాడీ టీచర్

MNCL: నెన్నెల మండలం గుండ్లసోమారంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు ఎదురుకుంటున్న అంగన్వాడీ టీచర్ వరలక్ష్మిపై సోమవారం సర్పంచ్ సింగతి రాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్ సమయపాలన పాటించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. సమయపాలన పాటించి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

March 2, 2026 / 04:01 PM IST

ఉత్సాహంగా.. స్వపరిపాలన దినోత్సవం

NLG: చిట్యాల మండలం ఉరుమడ్ల ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వపరిపాలన దినోత్సవం ఉత్సాహంగా సాగింది. విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా మారి బోధన చేస్తూ అలరించారు. పాఠశాల ఛైర్మెన్ పట్ల మౌనిక జనార్ధన్, హెచ్‌ఎం ఆర్.వెంకన్న, ఉపాధ్యాయుడు బి.యాదయ్య సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లల ప్రతిభను అందరూ అభినందించారు. ఈ వేడుక విద్యార్థుల్లో బాధ్యతను పెంచినట్లు వారు తెలిపారు.

March 2, 2026 / 04:01 PM IST

పెనుకొండ–ధర్మవరం డబ్లింగ్ పనుల పూర్తి

సత్యసాయి: రాయలసీమ అభివృద్ధికి ఊతమిచ్చేలా పెనుకొండ–ధర్మవరం మధ్య 42 కిలోమీటర్ల రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రాజెక్ట్‌లో కీలకమైన మక్కజిపల్లి–ధర్మవరం మధ్య 30.04 కిలోమీటర్ల సెక్షన్ పనులు పూర్తి కావడంతో ఈ మార్గం అందుబాటులోకి వచ్చింది. పెనుకొండ–ధర్మవరం మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

March 2, 2026 / 04:00 PM IST

ములకలూరు మైనార్టీ కాలేజీపై కలెక్టర్‌కు గోపిరెడ్డి వినతి

PLD: నరసరావుపేట మండలం ములకలూరులోని ముస్లిం మైనార్టీ కళాశాల, హాస్టళ్లను వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ భవనాలను ఇతర విభాగాలకు అప్పగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, మైనార్టీ విద్యార్థుల ప్రయోజనాల కోసం వీటిని వారికే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

March 2, 2026 / 04:00 PM IST

హనుమంతరాయ చౌదరి ఆరోగ్యంపై పల్లా ఆందోళన

ATP: మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అనారోగ్యంతో అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకుని పూర్వ వైభవంతో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు.

March 2, 2026 / 04:00 PM IST

కర్లపాలెంలో గొలుసు దొంగల అరెస్ట్

BPT: వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను కర్లపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఎస్పీ ఉమామహేశ్వర్ ఈ వివరాలను వెల్లడించారు. 2025లో కర్లపాలెం అయ్యప్ప స్వామి గుడి వద్ద జరిగిన చోరీ కేసులో గుంటూరుకు చెందిన అఖిల్, రాజాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి బంగారం, బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

March 2, 2026 / 04:00 PM IST

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 127 మంది విద్యార్థులు గైరాజార్

SRCL: సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 127 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎంపీసీ విద్యార్థులకు మ్యాథమెటిక్స్, సీఈసీ విద్యార్థులకు పొలిటికల్ సైన్స్, బైపీసీ విద్యార్థులకు బోటనీ పరీక్ష నిర్వహించగా, మొత్తం 4764 మంది విద్యార్థులకు గాను 4637 మంది హాజరైనట్లు అధికారులు వివరించారు. పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.

March 2, 2026 / 04:00 PM IST

‘అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం అండ’

W.G: అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు స్పష్టం చేశారు. సోమవారం భీమవరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో అంగన్వాడీల్లో 70 శాతం ఉన్న హాజరు, ప్రస్తుత ప్రభుత్వ చొరవతో 90 శాతానికి పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు.

March 2, 2026 / 04:00 PM IST

హైడ్రా అద్భుతం.. ప్రారంభానికి సిద్ధం..!

HYD: గ్రేటర్ పరిధిలో చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా హైడ్రా ముందుకు కదులుతోంది. దీంట్లో భాగంగా బుమూక్ దౌల, కూకట్‌పల్లి నల్ల చెరువు అభివృద్ధి పనులు తుది దశకు చేరాయి. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ చెరువులను ప్రారంభించేందుకు HYDRAA సన్నహాలు చేస్తోంది. వీటితోపాటు మరో 13 చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. కాగా వీటికి రూ.303 కోట్లు అవసరం.

March 2, 2026 / 04:00 PM IST

‘ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలి’

జీడిపిక్కలకు ప్రభుత్వం రూ. 200 మద్దతు ధర ప్రకటించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్ రాయవరం మండలం వేమగిరిలో ఉపాధి కూలీలతో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వమే జీడిపిక్కలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటిస్తున్న ప్రభుత్వం జీడిపిక్కలకు ఎందుకు ప్రకటించడం లేదన్నారు.

March 2, 2026 / 04:00 PM IST