• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రిజ్వాన్ నగర్‌లో అభివృద్ధి పనులకు భూమి పూజ

కడప నగర శివారులోని 27వ డివిజన్ రిజ్వాన్ నగర్‌లో సీసీ రోడ్డు, డ్రైనేజ్, వాటర్ పైప్‌లైన్ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిధుల ద్వారా కడప మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.1.12 కోట్లు విడుదల కాగా, ఎంపీ లాడ్స్ కింద రూ.6 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైన్ పనులు, రూ.4 లక్షలతో పైప్‌లైన్ పనులను ప్రారంభించారు.

March 2, 2026 / 04:00 PM IST

హోలీ పండుగ తేదీ వివాదం

MBNR: జిల్లాలో హోలీ పండుగ తేదీలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 3న చంద్రగ్రహణం ఉండటంతో, ఒక వర్గం మార్చి 4న రంగుల హోలీ జరుపుకోవాలని భావిస్తుండగా.. యువత రేపే జరుపుకోవాలని సూచిస్తున్నారు. గ్రహణం సాయంత్రం 6:47కు ముగియటంతో పెద్దలు శుభకార్యాలు ఆ తర్వాత చేయాలని సూచించి గందరగోళం నెలకొంది.

March 2, 2026 / 03:59 PM IST

రాహుల్ గాంధీని కలిసిన జిల్లా అధ్యక్షురాలు

JN: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని జనగామ డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ కలిశారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని, అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తలను కలుపుకొని ఏకతాటిపైకి తీసుకువచ్చి క్షేత్ర స్థాయిలో చురుకుగా పనిచేయాలని రాహుల్ గాంధీ సూచించినట్లు జిల్లా అధ్యక్షురాలు తెలిపారు.

March 2, 2026 / 03:58 PM IST

హోలీ పండుగ ఎప్పుడంటే..?

హోలీ పండుగపై ప్రజల్లో అయోమయం నెలకొంది. ఇవాళ సాయంత్రం 5.55 గంటల నుంచి పౌర్ణమి తిథి ప్రారంభమై రేపు సాయంత్రం 5.07 గంటలకు ముగుస్తుంది. ఇవాళ హోలికా దహన్ వేడుకను జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే రేపు చంద్రగ్రహణం సందర్భంగా హోలీ జరుపుకోవద్దని.. మార్చి 4న హోలీ జరుపుకోవాలని తెలిపారు. కాగా, మార్చి 3నే రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

March 2, 2026 / 03:57 PM IST

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదు: హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ ఈనెల 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఇది ఏ సినిమాకు రీమేక్ కాదని స్పష్టం చేశాడు. కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించాడు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు.

March 2, 2026 / 03:57 PM IST

అన్నదాతలకు రాజముద్రతో పాసుపుస్తకాలు

TPT: కేవీబీ పురం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం 107 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. వ్యక్తుల ఫోటోలు లేకుండా ప్రభుత్వ రాజముద్రతో మాత్రమే పాసుపుస్తకాలు ముద్రించి అందిస్తున్నామని తెలిపారు. సూర్యనారాయణపురం (70 మంది), బక్కపోతుల కుంట (37 మంది) రైతులు లబ్ధి పొందారు.

March 2, 2026 / 03:56 PM IST

కలెక్టర్‌ను కలిసిన జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు

BDK: భద్రాద్రి జిల్లాకు నూతన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అంకిత్‌ని జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది. జిల్లాలో ధాన్యం కొనుగోలు, నిల్వలు, రవాణా వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకారం అందించాలన్నారు.

March 2, 2026 / 03:53 PM IST

గద్వాల చేనేత యంత్రాలు సమస్య

GDWL: గద్వాల ఆధునీకరణ పేరుతో ప్రభుత్వం పంపిణీ చేసిన ఎలక్ట్రానిక్ జాకార్డ్ యంత్రాలు చేనేత కార్మికుల పాలిట శాపంగా మారాయి. కోయంబత్తూరు క్యూబ్-టెక్ సంస్థ సరఫరా చేసిన పరికరాలు నాసిరకంగా ఉన్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చి, యంత్ర లోపం వల్ల చీరలు డ్యామేజ్ అవుతున్నట్టు తెలిపారు.

March 2, 2026 / 03:53 PM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్

KNR: జిల్లాలో కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సోమవారం తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ వింగ్ కళాశాల, భగత్ నగర్‌లోని అల్ఫోర్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను, సీసీ కెమెరా వ్యవస్థను పరిశీలించారు.

March 2, 2026 / 03:52 PM IST

నేను కేసులకు భయపడే వ్యక్తిని కాదు: బాలినేని

AP: ఒంగోలులో టీడీపీ, వైసీపీ కలిసి పనిచేస్తున్నాయని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ‘ఎవరు ఎవరితో కలిసినా నన్ను ఎవరూ ఏం చేయలేరు. ఒంగోలులో టీడీపీ, వైసీపీ కలిసి పనిచేస్తున్నాయి. నేను జనసేనలో చేరడంపై విమర్శలు చేస్తున్నారు. దోచుకున్నది దాచుకోవడానికే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. కేసులకు భయపడే వ్యక్తిని కాదు’ అని పేర్కొన్నారు.

March 2, 2026 / 03:50 PM IST

కారు, లారీ ఢీ.. ఎంపీడీవోకు తప్పిన ప్రమాదం

నెల్లూరు రూరల్ వడ్డిపాలెం వద్ద సోమవారం తోటపల్లి గూడూరు ఎంపీడీవో వెంకటేశ్వర్ రావు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీడీవో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 2, 2026 / 03:50 PM IST

‘ఎస్పీ కార్యాలయానికి 27 పిర్యాదులు’

కోనసీమ: అమలాపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకి 27 పిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎస్పీ రాహుల్ మీనాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, త్వరితగతిన పిర్యాదులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

March 2, 2026 / 03:50 PM IST

ఘనంగా రాష్ట్ర యువజన అధ్యక్షుడు జన్మదిన వేడుకలు

BHPL: జిల్లా కేంద్రంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా యువజన అద్యక్షుడు శ్రీకాంత్ పాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ నేతలు కేక్ కట్ చేసి.. శివ చరణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అమృత వర్షిణి అనాధ వృద్ధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

March 2, 2026 / 03:48 PM IST

‘హెల్మెట్ బ్యాంక్’ ద్వారా ద్విచక్ర వాహనదారులకు చైతన్యం

MDCL: మల్కాజ్‌గిరి పరిధిలోని నేరేడ్మెట్ వాయుపురిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హెల్మెట్ ధరించని రైడర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి, ‘హెల్మెట్ బ్యాంక్’ ద్వారా తాత్కాలిక హెల్మెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 03:47 PM IST

‘ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి’

BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఉన్నారు.

March 2, 2026 / 03:47 PM IST