• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

PGRS ఫిర్యాదులపై తక్షణ చర్యలు: ఎస్పీ

అన్నమయ్య: మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.

March 2, 2026 / 03:36 PM IST

సీనియర్ సిటిజన్ కార్డుల మంజూరు నిలిపివేత

MNCL: మంచిర్యాల జిల్లాలో వయోవృద్ధులకు సంబంధించిన సీనియర్ సిటిజన్ కార్డులు మంజూరు చేయడాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపివేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ తెలిపారు. సీనియర్ సిటిజన్ కార్డుల వల్ల ఎలాంటి ఉపయోగం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు కోసం ఆధార్ కార్డు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

March 2, 2026 / 03:36 PM IST

సింగరకొండ రథోత్సవానికి 650 మంది పోలీసుల భద్రత

ప్రకాశం: సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి 71వ వార్షికోత్సవం, రథోత్సవ బందోబస్తును ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు సోమవారం పరిశీలించారు. ఇవాళ జరగనున్న రథోత్సవానికి ముగ్గురు DSPలు, నలుగురు CIలు, 40 మంది SIలతో కలిపి మొత్తం 650 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ పరిసరాలను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు.

March 2, 2026 / 03:35 PM IST

అర్జీలు స్వీకరించిన జేసీ

నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ హిమాన్షు శుక్లా అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

March 2, 2026 / 03:34 PM IST

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు: కలెక్టర్

NGKL: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. 43 ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.

March 2, 2026 / 03:34 PM IST

T20 WCలో రేపే తొలి సెమీఫైనల్

T20 WCలో రేపు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు ట్రోఫీని గెలుచుకోలేకపోయాయి. దీంతో ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే, కివీస్ జట్టుతో పోలిస్తే ప్రస్తుతం సఫారీ జట్టు బలంగా కనిపిస్తోంది.

March 2, 2026 / 03:34 PM IST

T20 WC తొలి సెమీఫైనల్: SA vs NZ

T20 WCలో ఈనెల 4న సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు ట్రోఫీని గెలుచుకోలేకపోయాయి. దీంతో ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే, కివీస్ జట్టుతో పోలిస్తే ప్రస్తుతం సఫారీ జట్టు బలంగా కనిపిస్తోంది.

March 2, 2026 / 03:34 PM IST

కర్తవ్యం వర్సెస్ కన్నీరు ఒక ఎస్సై భావోద్వేగ పోరాటం

KMM: సాధారణంగా ఖాకీ చొక్కా వెనుక కఠినత్వం ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఆ యూనిఫామ్ వెనుక కూడా ఒక స్పందించే గుండె ఉంటుందని నిరూపించే దృశ్యం ఇది. ఒక మహిళ ఎంతో ఆవేదనతో తన గోడును వెళ్లగక్కుతుంటే, అక్కడ విధుల్లో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) ఆమె బాధను చూసి చలించిపోయారు. ఇలాంటి అధికారులు ఉన్నప్పుడే వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది.

March 2, 2026 / 03:32 PM IST

ప్రారంభమైన రోడ్డు విస్తరణ పనులు

KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలోని ఇరుకు దారి విస్తరణ కోసం పంచాయతీ పాలకవర్గం చర్యలు చేపట్టింది. పురాతన ఇళ్లను ఈ క్రమంలోనే ఆదివారం కూల్చివేశారు. కానీ, అదే మార్గంలో ఉన్న బడా బాబుల ఇండ్లను కూలుస్తారా లేదా అనే ప్రశ్నలను ప్రజలు లేవనెత్తుతున్నారు. సమన్యాయం పాటించాలని, ఇండ్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

March 2, 2026 / 03:32 PM IST

మందుగుండు తయారీ కేంద్రం సీజ్

AKP: నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామంలోని శ్రీ వేమ శివ గణేష్ క్రాకర్స్ తయారీ యూనిట్‌ని సోమవారం రెవిన్యూ అధికారులు సిజ్ చేశారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ప్రమాదం దృష్ట్యా తహసీల్దార్ లోకవరపు రామారావు ఆదేశాలతో మందు గుండు తయారు కేంద్రాన్ని సీజ్ చేసినట్లు వీఆర్వో సత్య నాగ శివ భాస్కర్ తెలిపారు.

March 2, 2026 / 03:31 PM IST

మాజీ స్పీకర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్

MHBD: దివంగత శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు సోమవారం కలెక్టరేట్‌‌లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో, రెవెన్యూ కె. అనిల్ కుమార్, తదితరులున్నారు.

March 2, 2026 / 03:31 PM IST

‘మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి’

JGL: మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు 87వ జయంతి సందర్భంగా జగిత్యాల కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నిష్పక్షపాతంగా పనిచేసిన నాయకుడని పేర్కొన్నారు. యువత ఆయన సేవాభావం, నైతిక విలువలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

March 2, 2026 / 03:31 PM IST

బాల్య వివాహ ముక్త భారత్ రథం ప్రారంభం

కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో బాల్య వివాహాల విముక్తి రథాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ICDS డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జెండా ఊపి ఇవాళ ప్రారంభించారు. ఈ రథం జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల్లో పర్యటిస్తూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తుందని వారు తెలిపారు. ఆడపిల్లలను చదువు ద్వారా ప్రయోజకులను చేయాలన్నారు.

March 2, 2026 / 03:31 PM IST

పిఠాపురం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 53 అర్జీలు స్వీకరణ

KKD: పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అధారిటీ (పాడా) కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాడా ఎపీడీ వసంత మాధవి పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజల నుంచి వివిధ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల వద్ద నుంచి వివిధ అంశాలపై 53 అర్జీలు అందాయన్నారు. ఈ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.

March 2, 2026 / 03:30 PM IST

కొడాలి నానిని ప్రజలు మర్చిపోయారు: ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ టీడీపీ కార్యాలయం ఎమ్మెల్యే రాము సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయనకొడాలి నాని త్వరలో తాను జైలుకు వెళుతున్నానని అర్థమయిందేమోనని, ఏ జైలు అయితే బాగుంటుందో చూసుకోవడానికి గుంటూరుకి వెళ్లారని అన్నారు. కొడాలి నానిని ప్రజలు మర్చిపోయారని, ఆయన గురించి మాట్లాడుకునేది ఏమీ లేదని తెలిపారు.

March 2, 2026 / 03:30 PM IST