• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాహుల్ గాంధీని కలిసిన మంత్రి సీతక్క

MLG: వికారాబాద్ జిల్లాకు విచ్చేసిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మంత్రి సీతక్క కలిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో రాహుల్ గాంధీ సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు.

March 2, 2026 / 03:30 PM IST

కొడాలి నానిపై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

AP: మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్ర విమర్శలు చేశారు. కొడాలి నాని జైలుకు వెళ్లడం ఖాయమని, అందుకే ఆయన ఇప్పటి నుంచే అక్కడ సౌకర్యాల గురించి ఆరా తీస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘జైలుకు వెళ్లి వచ్చిన వారిని కలిసి.. అక్కడ గుట్కాలు దొరుకుతయా? టీ, కాఫీలు ఇస్తారా? సౌకర్యాలు ఎలా ఉంటాయని అడిగి తెలుసుకుంటున్నారు’ అని సెటైర్లు వేశారు.

March 2, 2026 / 03:29 PM IST

అధైర్య పడకండి.. అండగా ఉంటాను: ఎమ్మెల్యే

SRD: రహదారి విస్తరణలో ఇళ్లు, షాపులు కోల్పోతున్న వారు అధైర్య పడవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటాననీ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సోమవారం బంధం కొమ్ము రహదారి విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ఇల్లు యజమానులు నష్టపోకుండా సరికొత్త ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు.

March 2, 2026 / 03:27 PM IST

ఘనంగా శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలు

BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై, శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన ఆయన సేవాభావాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అధికారులు ఉన్నారు.

March 2, 2026 / 03:26 PM IST

‘రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు’

HYD: ఉద్యోగులు రెండు సంవత్సరాలుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని SDNR బీజేపీ నేత నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి అన్నారు. ఇందిరా పార్క్ వద్ద BJP ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఉద్యోగుల పీఆర్సీ అమలు చేయాలని, నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు.

March 2, 2026 / 03:26 PM IST

ఒవైసీ కాలేజీ కూల్చే దమ్ములేదా?: బండి సంజయ్

TG: గాంధీవిగ్రహం పేరుతో పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గమని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. బఫర్ జోన్, FTL పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తే.. పెద్దల ఇళ్లను బుల్డోజర్లతో కూలుస్తామన్నారు. ఒవైసీ కాలేజీ కూల్చడానికి పరీక్షల సాకు చెప్పారన్నారు. మరి ఖమ్మంలో ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ గుర్తురాలేదా? అని ప్రశ్నించారు. ఒవైసీ కళ్లలో ఆనందం కోసం హిందువులను జైల్లో వేస్తారా? అని దుయ్యబట్టారు.

March 2, 2026 / 03:26 PM IST

పాక్ ఆటగాళ్లకు PCB భారీ జరిమానా

T20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శనపై ఆ దేశ క్రికెట్ బోర్డ్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. టోర్నీలో జట్టు వైఫల్యానికి బాధ్యతగా ప్రతి ఆటగాడికి 50 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ కథనం ప్రకారం.. ఆటగాళ్ల అసమర్థత వల్లే జట్టు సెమీస్ చేరలేకపోయిందని బోర్డు భావిస్తుంది.

March 2, 2026 / 03:26 PM IST

ప్రశాంత వాతావరణంలో హోలీ వేడుకలు జరుపుకోవాలి: SP

WGL: హోలీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని భూపాలపల్లి జిల్లా SP సంకీర్త్ గౌడ్ సూచించారు. ప్రకృతి సిద్ధమైన రంగులతో, సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోవాలని అన్నారు. బలవంతపు చందాలకు, నిబంధనల ఉల్లంఘనకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట రిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 2, 2026 / 03:24 PM IST

‘హోళీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి’

SRPT: హోళీ పండుగను సహజ సిద్ధమైన రంగులతో, పరస్పర గౌరవంతో నిర్వహించుకోవాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ మండల ప్రజలకు సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం చేయరాదని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 2, 2026 / 03:23 PM IST

జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు: కలెక్టర్

NZB: హోళీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్ ఇలా ట్రిపాఠి జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ.. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలాషించారు.

March 2, 2026 / 03:23 PM IST

‘విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’

HNK: నిట్‌లో ఫుడ్ పాయిజన్ అయి చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎస్ఎఫ్ఐ నేతలు పరామర్శించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. నిట్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన జరగడం బాధాకరమని, ఫుడ్ పాయిజన్ ఘటనపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా సహాయ కార్యదర్శి జశ్వంత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

March 2, 2026 / 03:22 PM IST

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 317 మంది గైర్హాజరు

NRML: సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం గణితం పత్రం–1 ఏ, వృక్షశాస్త్రం, రాజకీయ శాస్త్రం పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 7,392 మంది విద్యార్థుల్లో 7,075 మంది హాజరై పరీక్ష రాయగా, 317 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి పరశురాం తెలిపారు.

March 2, 2026 / 03:21 PM IST

‘గుడిసె వాసులకు ఇంటి పట్టాలను ఇవ్వాలి’

HNK: గుడిసె వాసులకు ఇంటి పట్టాలను ఇవ్వాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి అన్నారు. పలివెల్పులలో గుడిసె వాసులతో సీపీఐ నేతలు సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఆచరణలో అరకొర అమలు చేసి గొప్పలు చెప్పుకుంటున్నాయని, స్థానికంగా కనీస మౌలిక సదుపాయాలు సైతం కల్పించకపోవడం బాధాకరమని అన్నారు.

March 2, 2026 / 03:21 PM IST

కాంగ్రెస్ నేతలు బయట తిరగలేరు: బండి

TG: కాంగ్రెస్‌లోనే అంతర్యుద్ధం మొదలైందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. మాటల కోసమే తెలంగాణకు రాహుల్ వచ్చారని మండిపడ్డారు. హిందువులంతా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీ తలుచుకుంటే కాంగ్రెస్ నేతల బయట తిరగలేరని హెచ్చరించారు.

March 2, 2026 / 03:21 PM IST

రాజమహేంద్రవరంలో వైభవంగా సలాలా పండుగ

E.G: రాజమహేంద్రవరం బర్మా కాలనీ శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఆధ్వర్యంలో సోమవారం పుష్కరాల రేవులో సలాలా పండుగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజమహేంద్రవరం సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలను వడ్డించారు.

March 2, 2026 / 03:20 PM IST