BHNG: రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ఆసుపత్రిలో వైద్య సేవలు, మౌలిక వసతులు, సిబ్బంది కొరత, మందుల లభ్యతపై సమీక్ష నిర్వహించారు. రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
IND-ENG మధ్య 5న T20 WC సెమీస్ జరగనున్న సంగతి తెలిసిందే. వెదర్ రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుతానికి ఈ పోరుకు వర్షం ముప్పు లేదు. ఒకవేళ వర్షం పడితే నాకౌట్ మ్యాచ్ కావడంతో రిజర్వ్ డే ఉంటుంది. ఆ రోజూ ఫలితం రాకపోతే.. సూపర్-8 దశలో మెరుగైన స్థానం కలిగిన ENG ఫైనల్‌కు చేరుతుంది. SA-NZ తొలి సెమీస్‌కూ ఇదే పరిస్థితి. రిజర్వ్ డేలో ఫలితం రాకుంటే సఫారీలు తుదిపోరుకు వెళ్తారు.
SRPT: నడిగూడెం మండలం రత్నవరం MPPS పాఠశాలలో ‘ప్రీ-ప్రైమరీ’ (LKG, UKG) తరగతులను నేడు మండల విద్యాధికారి సత్యనారాయణ, సర్పంచ్ నాగేశ్వరరావు ప్రారంభించారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆట వస్తువులను, తరగతి గదులను వారు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆటపాటలకు ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు.
ADB: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి, స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు జయంతి వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీపాద రావు సేవలు మరువలేనివని కొనియాడారు.
కంప్యూటర్ ముందు వర్క్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో 20సెకన్ల పాటు కళ్లను మూసి విశ్రాంతి నివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. స్క్రీన్‌ను కళ్లకు తక్కువ ఎత్తులో ఉండేలా చూసుకోండి. రాత్రివేళల్లో సెల్‌ఫోన్ వాడకం తగ్గించండి. లైటింగ్ వల్ల కంటి చిన్నకండరాలు త్వరగా అలసిపోతాయి. ఏసీ, కూలర్ నుంచి వచ్చే గాలులు నేరుగా కంటిమీద పడనివ్వకండి. గోరువెచ్చని నీటితో శుభ్రపరచండి.
KMM: ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. పదవ తరగతి చదివే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం స్థానిక శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మోటివేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని TDP నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం తెలిపారు. చంద్రమౌళి నగర్లో రూ. 40 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. నియోజకవర్గంలో చేపట్టిన 240 పనుల్లో ఇప్పటికే 235 పనులు పూర్తి చేశామని వెల్లడించారు. మార్చి 3వ వారంలో ప్రజల చేతుల మీదుగానే వీటిని ప్రారంభిస్తామన్నారు.
కోనసీమ: భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ కోనేరు (పుష్కరిణి) ప్రస్తుతం దుస్థితికి చేరుకుంది. గత రెండేళ్లుగా నీటిని మార్చకపోవడంతో కోనేరు పాచిపట్టి, మురికి కూపంగా దర్శనమిస్తోంది. మరో నెల రోజుల్లో స్వామి వారి కళ్యాణోత్సవం రానుంది.ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు
TPT: దొరవారిసత్రం మండలం మీజూరు సచివాలయం పరిధిలోని మల్లెపాలెం గ్రామంలో 94 మంది రైతులకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రభుత్వ రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల భూమి హక్కులను శాశ్వతంగా రక్షించేందుకు క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీతో కూడిన ఆధునిక పాస్ పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు.
యాంకర్, నటి రష్మీ తన సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీకి కీలక విజ్ఞప్తి చేసింది. ‘మన దేశం ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వాన్ని, అన్ని మతాలను గౌరవించింది. కానీ రాడికల్ (అతివాద) మనస్తత్వాన్ని మేము సహించము. ఈ వ్యాధిని ఇక్కడ వ్యాప్తి చెందనివ్వం. రాడికల్ ఆలోచనలతో ఉండి, యుద్ధాన్ని సమర్థించే వారిని దయచేసి ఇరాన్‌కు పంపాలి’ అని కోరింది.
HNK: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించబోయే ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరు కావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు ఆహ్వానం అందజేశారు. మార్చి 29వ తేదీన ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని పూర్వ విద్యార్థుల సంఘం నేతలు తెలిపారు.
NDL: బేతంచర్ల నగర పంచాయతీలో జనవరి, ఫిబ్రవరి నెలల కౌన్సిల్ సమావేశం జరగకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. వార్డుల అభివృద్ధిపై చర్చించలేక కౌన్సిలర్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మార్చిలోనైనా సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని ఇవాళ ప్రజా సంఘాల నాయకులు కోరారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
BDK: ఇల్లందులోని రద్దీ ప్రాంతమైన జగదంబ సెంటర్లో గల సులభ్ కాంప్లెక్స్ సకాలంలో తెరవకపోవడంపై మున్సిపల్ ఛైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంప్లెక్స్ మూసి ఉండటంతో మహిళలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆమె తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి నిర్ణీత సమయానికి ప్రారంభించాలని ఆదేశించారు.
MBNR: మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డి.జానకి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. శ్రీపాదరావు ప్రజాస్వామ్య పరిరక్షణకు, శాసన వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టేందుకు కృషి చేసిన విశిష్ట నాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ కృష్ణయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
BHPL: రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా ఎపిడెమిక్ బృందం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. భక్తుల భారీ రద్దీ నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నారు. జాతరకు తరలివచ్చిన భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్య బృందం సూచించారు.