• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రజల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించండి: కలెక్టర్

WNP: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లతో కలిసి ఆయన 40 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టం చేశారు.

March 2, 2026 / 03:00 PM IST

రేపు పెగడపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మూసివేత

JGL: ఈనెల 3న రాహుగ్రస్త చంద్రగ్రహణం పురస్కరించుకొని మండల కేంద్రంలోని స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి సేవలు మధ్యాహ్నం నుంచి రద్దు చేస్తున్నట్లు ఆలయ కమిటీ, ఆలయ పూజారి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12గంటల నుంచి గుడిని మూసి వేస్తామన్నారు. తిరిగి ఈ నెల 4వ తేదీన బుధవారం ఉదయం నుంచి భక్తులకు స్వామివారి దర్శనం, అర్జిత సేవలు యథావిధిగా జరుగుతాయాన్నారు.

March 2, 2026 / 03:00 PM IST

‘కందులు కొనుగోలు కేంద్రం ప్రారంభం’

ప్రకాశం: మార్కాపురంలోని మార్కెట్ యార్డులో కందులు కొనుగోలు కేంద్రాన్ని సోమవారం టీడీపీ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంఛార్జ్ కందుల రామిరెడ్డి రిబ్బన్ కట్ చేసే ప్రారంబించారు. కందులు సాగు చేసిన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, PACS ఛైర్ పర్సన్ జవ్వాజి రామాంజనేయులు రెడ్డి పాల్గొన్నారు.

March 2, 2026 / 03:00 PM IST

అంకితభావంతో పనిచేసిన వారికి నిరంతరం గుర్తింపు: MP

SRD: అంకితభావంతో పనిచేసిన వారికి నిరంతరం గుర్తింపు లభిస్తుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ అన్నారు. మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన ప్రభుత్వం ఉపాధ్యాయుడు భాస్కర్ రిటైర్మెంట్ అభినందన సభ నేడు ఖేడ్‌లోని బసవ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ హాజరై ఉద్యోగ విరమణ పొందిన భాస్కర్‌కు శాలువ కప్పి సన్మానించారు.

March 2, 2026 / 03:00 PM IST

‘మండపేట విలీనం.. జేఏసీ పోరాటం ఫలితం’

కోనసీమ: మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరిందని జేఏసీ ఛైర్మన్ కామన ప్రభాకర్ రావు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జేఏసీ పోరాటం ఫలించిందన్నారు. ఈ క్రమంలో సోమవారం జేఏసీని రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కోనసీమ జిల్లా నుంచి తూర్పుగోదావరిలోకి మండపేట చేరడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

March 2, 2026 / 03:00 PM IST

వైభవంగా శ్రీశ్రీశ్రీ పాశాలమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం

E.G: సీతానగరం మండలం కాటవరంలో కొలువైయున్న శ్రీశ్రీశ్రీ పాశాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరారు.

March 2, 2026 / 03:00 PM IST

రేపు చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

RR: రేపు చంద్రగ్రహణం సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేయడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. రేపు ఉదయం 7:30 గంటల వరకు స్వామివారి సేవలు ముగించి గుడి మూసి వేయడం జరుగుతుందని, తిరిగి సాయంత్రం 7 గంటలకు శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తుల దర్శనాలు బుధవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. భక్తులు గమనించాలని కోరారు.

March 2, 2026 / 02:59 PM IST

రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ

CTR: గుడిపాల మండలంలోని గుడిపాల గ్రామ రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA తండ్రి చెన్నకేశవులు నాయుడు మాట్లాడుతూ.. రైతు బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రైతుల అవసరాలను ముందుగానే గుర్తించి ప్రభుత్వం తగిన యూరియా నిల్వలను సిద్ధం చేసిందని తెలిపారు. ఎలాంటి దళారితనం లేకుండా పారదర్శకంగా పంపిణీ జరుగుతుందన్నారు.

March 2, 2026 / 02:56 PM IST

ప్రశాంతంగా హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

MDK: హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ డీవీ శ్రీనివాస రావు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, చెరువులు–కుంటల వద్ద ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని సూచించారు. అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

March 2, 2026 / 02:55 PM IST

5న మహిళా దినోత్సవ వేడుకలు

VZM: ఈనెల 5వ తేదీన జనని యే జగతికి ఆధారం అనే పేరుతో మహిళా దినోత్సవ వేడుకలు, సాంస్కృతిక ఉత్సవం సన్ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం పాఠశాల కరస్పాండెంట్ మామిడి పాక అనిల్ కుమార్‌తో కలిసి ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు. 2026 మహిళా దినోత్సవ పురస్కారాన్ని స్వప్న హైందవికి ప్రదానం చేయనున్నారు.

March 2, 2026 / 02:55 PM IST

ట్రంప్, మస్క్‌పై గరికపాటి కీలక వ్యాఖ్యలు

AP: ప్రవచనకర్త గరికపాటి నరసిహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమలాపురంలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన మాట్లాడుతూ.. ‘డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ రాక్షసులు. అంగారక గ్రహంలో మస్క్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. ట్రంప్ ఆధిపత్యం కోసం కనిపించే దేశంపై దండయాత్ర చేస్తున్నాడు. వాళ్లను నాశనం చేయడానికి శ్రీమహా విష్ణువు రావాల్సిందే’ అని పేర్కొన్నారు.

March 2, 2026 / 02:53 PM IST

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: జేసీ

శ్రీకాకుళం నగరంలో డయేరియా కట్టడి లక్ష్యంగా పారిశుధ్య నిర్వహణను జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. సోమవారం పారిశుధ్య నిర్వహణ పనులను , కార్మికుల హాజరును స్వయంగా పరిశీలించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలువల్లో ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా పూడికను పూర్తిస్థాయిలో తొలగించాలని ఆదేశించారు.

March 2, 2026 / 02:51 PM IST

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

ADB: ఇచ్చోడ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మహిమూద్ సోదరుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం మధ్యాహ్నం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

March 2, 2026 / 02:51 PM IST

ఆసుపత్రి సేవలపై ఎమ్మెల్యే సమీక్ష

BHNG: రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ఆసుపత్రిలో వైద్య సేవలు, మౌలిక వసతులు, సిబ్బంది కొరత, మందుల లభ్యతపై సమీక్ష నిర్వహించారు. రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

March 2, 2026 / 02:50 PM IST

IND vs ENG: వర్షంతో సెమీస్ రద్దయితే?

IND-ENG మధ్య 5న T20 WC సెమీస్ జరగనున్న సంగతి తెలిసిందే. వెదర్ రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుతానికి ఈ పోరుకు వర్షం ముప్పు లేదు. ఒకవేళ వర్షం పడితే నాకౌట్ మ్యాచ్ కావడంతో రిజర్వ్ డే ఉంటుంది. ఆ రోజూ ఫలితం రాకపోతే.. సూపర్-8 దశలో మెరుగైన స్థానం కలిగిన ENG ఫైనల్‌కు చేరుతుంది. SA-NZ తొలి సెమీస్‌కూ ఇదే పరిస్థితి. రిజర్వ్ డేలో ఫలితం రాకుంటే సఫారీలు తుదిపోరుకు వెళ్తారు.

March 2, 2026 / 02:48 PM IST