• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అక్రమ బెల్ట్ షాపులు తొలగించాలి: సీపీఐ

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గ్రామాలు, మండలాల్లో విస్తరిస్తున్న ఈ షాపుల వల్ల మహిళలు, యువత నష్టపోతున్నారని అన్నారు. అధికార యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

March 3, 2026 / 10:02 PM IST

‘అనధికారికంగా బాణసంచా తయారు చేస్తే చర్యలు’

W.G: బాణసంచా విక్రయ దుకాణాలు, తయారీ దారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నరసాపురం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భాస్కర్ రామమ్ హెచ్చరించారు. అనధికారికంగా బాణసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనధికారంగా బాణసంచా విక్రయించినా, అమ్మినా, నిల్వ చేసినా 101కు, లేదా స్టేషన్‌లో సమాచారం అందించాలని కోరారు.

March 3, 2026 / 09:44 PM IST

బొప్పాయి-పెరుగు ఫేస్ మాస్క్ ప్రయోజనాలివే!

✦ మృత చర్మాన్ని తొలగిస్తుంది✦ చర్మానికి సహజ కాంతి అందిస్తుంది✦ మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది✦ మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది✦ చర్మాన్ని మృదువుగా, తాజాగా ఉంచుతుంది✦ యాంటీఆక్సీడెంట్లు అకాల వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి

March 3, 2026 / 09:42 PM IST

ఇల్లు దగ్ధమైన ఘటనలో మంత్రి పార్థసారథి చేయూత

ELR: నూజివీడు(మం) ముక్కొల్లుపాడులో మారుమూడి రాజుకు చెందిన ఇల్లు షార్ట్ సర్క్యూట్‌తో మంగళవారం దగ్ధమయింది. ఉపసర్పంచ్ కలగర శివ సాయి మాట్లాడుతూ.. ప్రమాద సమాచారం తెలుసుకున్న మంత్రి పార్థసారథి బాధిత కుటుంబానికి రూ. 5వేలు, బియ్యం, నిత్యవసర సరుకులు తక్షణసాయంగా అందించినట్లు చెప్పారు. మంత్రి కొత్త ఇంటిని మంజూరు చేసేందుకు హామీ ఇచ్చినట్లు వివరించారు.

March 3, 2026 / 09:38 PM IST

జిల్లాలో వైన్స్ బంద్.. కలెక్టర్ కీలక ఆదేశం

హోలీ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు మెదక్ జిల్లాలో వైన్ షాపులు, బార్లను మూసివేయాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 3వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలను నిలిపివేస్తూ ‘డ్రై డే’గా ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

March 3, 2026 / 09:35 PM IST

ఆత్మకూరు బస్టాండ్‌లో ఉచిత నీటి ట్యాంక్

NDL: ఆత్మకూరు APSRTC బస్టాండ్‌లో ప్రయాణికుల దాహాన్ని తీర్చేందుకు ప్రభుత్వ హైస్కూల్ 1986-90 పూర్వ విద్యార్థులు స్టీల్ మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని శ్రీశైలం టీడీపీ సమన్వయకర్త వై. యుగంధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ నీటి ట్యాంకర్‌తో వేసవిలో ఉచిత త్రాగునీరు అందుబాటులో ఉండనుంది.

March 3, 2026 / 09:33 PM IST

అశ్వినీ వైష్ణవ్‌తో రామ్మోహన్‌నాయుడు భేటీ

AP: కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో భేటీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతం, శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్, తిరుపతి నగరాలకు డైరెస్ట్ రైళ్లను నడపడంపై చర్చించినట్లు తెలిపారు. అలాగే ధోలేరా అంతర్జాతీయ విమానాశ్రయం పురోగతిపై కూడా అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించామని పేర్కొన్నారు.

March 3, 2026 / 09:30 PM IST

డ్వాక్రా మహిళలకు GOOD NEWS

TG: డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురానుంది. బ్యాంకు నుంచి అప్పు తీసుకుని మెంబర్ చనిపోతే దాన్ని ఫ్యామిలీ చెల్లించాల్సి వచ్చేది. ఇక నుంచి మహిళల రుణానికీ బీమా స్కీమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీంతో రుణం తీసుకున్నవారు మరణిస్తే ప్రభుత్వమే బ్యాంకుకు చెల్లిస్తుంది. ఆ సభ్యురాలికి రూ.10 లక్షల బీమా కూడా ఉంటుంది. ఈ బీమా సొమ్మునూ ప్రభుత్వమే చెల్లిస్తుంది.

March 3, 2026 / 09:28 PM IST

ఆనందపురంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

BDK: అశ్వాపురం మండలం ఆనందపురానికి చెందిన బండారి పుల్లయ్య మంగళవారం ఆత్మహత్యకు యత్నించిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆయనను వెంటనే మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై స్పష్టత రాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

March 3, 2026 / 09:28 PM IST

3 రోజులు మిషన్ భగీరథ నీరు సరఫరా అంతరాయం

BDK: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి విస్తరణ పనుల దృష్ట్యా మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం అధికారులు తెలిపారు. పైప్లాన్ మళ్లింపు పనుల కారణంగా అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాల్లో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

March 3, 2026 / 09:22 PM IST

టీ20 వరల్డ్ కప్ సమరం.. రేపే తొలి సెమీఫైనల్‌

T20 ప్రపంచకప్‌లో తొలి సెమీఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రేపు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు సౌతాఫ్రికా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచింది. దీంతో రేపటి మ్యాచ్‌లో బలమైన సఫారీలను కివీస్ ఎలా అడ్డుకుంటుందో చూడాలి.LIVE: 7PM, జియోహాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్

March 3, 2026 / 09:22 PM IST

VIDEO: భారీ అగ్నిప్రమాదం

AP: గుంటూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని సైకిల్ స్టాండ్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 09:20 PM IST

నేపాల్‌లో ఎల్లుండి ఎన్నికలు

నేపాల్‌లో కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి ఎల్లుండి జరిగే పోలింగ్‌లో కోటి ఎనభై లక్షల మందికి పైగా అక్కడి ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ప్రవర్తనా నియమావళి అమలు చేస్తుంది. నేపాల్ ప్రతినిధుల సభలో 165 నియోజకవర్గాలు ఉన్నాయి.

March 3, 2026 / 09:19 PM IST

జోరుగా ఎర్ర మట్టి అక్రమ తవ్వకాలు

VKB: పెద్దేముల్ మండలం తట్టెపల్లిలో అనుమతులు ఏమి లేకుండా ఎర్ర మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు ఓవర్ లోడ్‌తో ఎర్ర మట్టిని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వానికి రావలసిన ఆదాయం భారీ ఎత్తున గండిపడుతోంది. గ్రామ శివారులోని సర్వే నంబర్ 206లో ఎలాంటి అనుమతులు లేకుండా పట్టపగలు తవ్వకాలు జరుపుతున్నారు.

March 3, 2026 / 09:17 PM IST

కన్నడ ఇండస్ట్రీలో మరో ఉద్యమం

కన్నడ ఇండస్ట్రీలో మరో ఉద్యమం మొదలైంది. పబ్లిక్ ఈవెంట్స్‌లో హీరోయిన్ల ఫొటోలు, వీడియోలు జూమ్ చేసి తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యరాలను సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ.. పోస్ట్‌లు పెడుతున్నారు. హీరోయిన్లు సప్తమి గౌడ, ఆషికారంగనాథ్, రుక్మిణివసంత్ నెట్టింట ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

March 3, 2026 / 09:14 PM IST