• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గిద్దలూరులో రేపు ప్రజా దర్బార్

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఉదయం గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజా దర్భార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలను స్వయంగా ఎమ్మెల్యే తెలుసుకొని అర్జీలను స్వీకరిస్తారు. కావున గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రజలు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు.

March 1, 2026 / 06:00 PM IST

తలశిల చంద్రశేఖరరావుకు బలసాని నివాళలు

GNTR: తలశిల చంద్రశేఖరరావు మృతి పార్టీకి తీరని లోటని ప్రత్తిపాడు వైసీపీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఆదివారం వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం తండ్రి చంద్రశేఖరరావు సంతాప సభలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

March 1, 2026 / 06:00 PM IST

రాయలసీమ లిఫ్ట్ సాధనపై వైసీపీ రౌండ్ టేబుల్

కడపలోని మేడా కన్వెన్షన్ సెంటర్‌లో వైసీపీ ఆధ్వర్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితర ప్రముఖ నేతలు పాల్గొని కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల ఇంఛార్జ్‌లు, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు.

March 1, 2026 / 05:59 PM IST

మార్చి 3న సోమేశ్వరాలయం మూసివేత

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మార్చి 3న ఉదయం 8 గంటలకు చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నట్లు ఆలయ ఈఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్చి 4న ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు సహకరించాలని కోరారు.

March 1, 2026 / 05:58 PM IST

అమెరికా బరితెగించి వ్యవహారిస్తుంది: ఎండి జహంగీర్

BHNG: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ మూకుమ్మడి దాడి చేసి ఇరాన్ సుప్రీం ఖమేనిని హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకదేశ సార్వమాధికారాన్ని దెబ్బతీసే హక్కు మరే దేశానికి లేదు. ప్రపంచ న్యాయ సూత్రాలను ధిక్కరిస్తూ అమెరికా బరితెగించి వ్యవహారిస్తుందన్నారు.

March 1, 2026 / 05:58 PM IST

ఇసుక లారీ ఢీ కొని అడవి పంది మృతి

MLG: ఏటూరునాగారం(M)చిన్నబోయినపల్లి గ్రామ సమీపంలోని హునుమాన్ నగర్ వద్ద జాతీయ రహదారి పై HNK వైపు వెళ్తున్న ఇసుక లారీ అకస్మాత్తుగా రోడ్డు పైకి వచ్చిన అడవి పందిని ఢీకొంది. ఈ ప్రమాదంలో పంది అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పంది శవాన్ని తీసుకెళ్లి పంచనామా నిర్వహించారు.

March 1, 2026 / 05:57 PM IST

నీటి ఎద్దడి లేకుండా చూడాలి: ఎమ్మెల్యే

E.G: వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఆదివారం తన కార్యాలయంలో రుడా, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలంలో కోట్లాది రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను నిరంతరం తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

March 1, 2026 / 05:55 PM IST

‘సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల సేకరణ’

VSP: జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలను సేకరించనునట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ వెల్లడించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయుల్లో సీనియార్టీ జాబితాను వెబ్‌సైట్లో పొందుపరిచామన్నారు. దీనిపై అభ్యంతరాలను 7వ తేదీలోగా తెలియజేయాలని కోరారు.

March 1, 2026 / 05:55 PM IST

నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు

KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణసంచా ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఆయన, బాధ్యతా రాహిత్యం వహించిన పెద్దాపురం ఆర్డీవో, డీఎస్పీ, జిల్లా కార్మికశాఖ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

March 1, 2026 / 05:55 PM IST

ఫ్యాన్స్‌కు విజయ్-రష్మిక విజ్ఞప్తి

విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం తర్వాత హైదరాబాద్‌లో ఈ నెల 4న గ్రాండ్‌గా రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు కేవలం ఆహ్వానం ఉన్న అతిథులు మాత్రమే హాజరుకావాలని వారు కోరారు. సెక్యూరిటీ, పోలీసుల ఆంక్షల దృష్ట్యా అభిమానులు ఎవరూ రావొద్దని, వచ్చి ఇబ్బంది పడొద్దని విజ్ఞప్తి చేశారు. అభిమానుల క్షేమమే తమకు ముఖ్యమని, వారి దీవెనలు ఎక్కడున్నా తమకు చేరుతాయని ‘విరోష్’ జంట తెలిపింది.

March 1, 2026 / 05:54 PM IST

ఆరోగ్యశ్రీని పూర్తిగా చంపే కుట్ర: వైఎస్ షర్మిల

AP: కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. 2.5 లక్షల ఆరోగ్య బీమా పచ్చి మోసమని అన్నారు. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అంతా బూటకమని తెలిపారు. ‘పేదోడి సంజీవనిని ప్రైవేట్ పరం చేసేందుకే UHC అంటూ డ్రామాలు. ప్రైవేట్ బీమా పేరుతో ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఉద్దేశ్య పూర్వకంగా ఆరోగ్యశ్రీని అనారోగ్య శ్రీగా మార్చుతున్నారు’ అని మండిపడ్డారు.

March 1, 2026 / 05:52 PM IST

తిరుపతిలో నూతనంగా అనంత హాస్పిటల్స్ ప్రారంభం

TPT: నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అనంత హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తిరుపతి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు. ముఖ్యంగా న్యూరో, స్పైన్ విభాగాల్లో అధునాతన చికిత్సలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

March 1, 2026 / 05:51 PM IST

‘గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి’

SKLM: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఆదివారం మంత్రి తన కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు, అన్ని గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు,తాగునీరు పథకం అమలులో ఎక్కడా ఆలస్యం జరగకుండా చూడాలని సూచించారు. ఇందులో ఆర్డీవో కృష్ణ‌మూర్తి, అధికారులు సుదాక‌ర్‌, తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 05:51 PM IST

ధర్పల్లిలో పెద్దిరాజు, పెద్దమ్మతల్లి ఉత్సవాలు

NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని పెద్దిరాజు సహిత పెద్దమ్మతల్లి ఆలయ 27వ వార్షికోత్సవాలు మార్చి 11 నుంచి మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు ముదిరాజ్ సంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా సాగే ఈ వేడుకలకు ముదిరాజ్ సంఘం సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలన్నారు.

March 1, 2026 / 05:50 PM IST

రైతులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే

ATP: రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం రైతులు చేపట్టిన దీక్షకు ఆదివారం ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. అసెంబ్లీలో గళం విప్పి 12 చెరువులకు నీరు తెప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. అనంతరం రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

March 1, 2026 / 05:49 PM IST