• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘పుష్కర ఏర్పాట్లు ప్రణాళిక బద్ధంగా ఏర్పాటు చేయాలి’

PDPL: 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రతిపాదనలు సమగ్రంగా సిద్ధం చేయాలని పెద్దపల్లి కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సీపీ అంబర్ కిషోర్ ఝాతో కలిసి నిర్వహించిన సమీక్షలో, ఘాట్ నిర్మాణం,రోడ్డు విస్తరణ,లైటింగ్, పార్కింగ్, ఆలయాల అభివృద్ధి వంటి పనులపై తక్షణ ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. గోలివాడ, మంథని పలుప్రాంతాల్లో ప్రత్యక చర్యలు చేపట్టాలన్నారు.

March 3, 2026 / 07:42 AM IST

శ్రీ‌మ‌త్ భాగ‌వ‌తం ప్రవచనంలో రాధా తత్త్వ వివరణ

VSP: భాగవతంలో రాధా దేవి శ్రీకృష్ణ పరమాత్ముడికి గూఢనాయకి అని వాగ్ధేవీ వరపుత్ర సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. ఋషి పీఠం, సత్సంగం ఆధ్వర్యంలో విశాఖ ఎంవీపీ కాలనీ ఏబీసీ పార్కులో జరుగుతున్న 14 రోజుల శ్రీమద్భాగవత ప్రవచన యజ్ఞం 12వ రోజు సోమవారం ఆయన ఉపన్యాసం చేశారు. రాసలీల, యోగలీల వంటి దివ్య తత్త్వాలను అర్థం చేసుకోవడం భగవదానుగ్రహం పొందినవారికే సాధ్యమన్నారు.

March 3, 2026 / 07:40 AM IST

రికార్డు సృష్టించిన అతిక

భారత ఫార్ములావన్ యువ కెరటం అతిక మీర్ మరో రికార్డు సృష్టించింది. COTFA కార్టింగ్ సిరీస్ ఐరోపా అంచెలో అతిక మూడో స్థానంలో నిలిచింది. COTFA రేసులో పోడియంపై నిలిచిన తొలి భారత రేసర్‌గా అతిక ఘనత సాధించింది. ఎఫ్-1 అకాడమీ మద్దతు ఇస్తున్న తొలి భారత రేసర్ అయిన అతిక.. గత కొన్ని నెలలుగా ట్రాక్‌లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తోంది.

March 3, 2026 / 07:39 AM IST

KUలో పార్ట్ టైం పోస్టుల దరఖాస్తులకు రేపే లాస్ట్

HNK: కేయూలోని వివిధ విభాగాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పార్ట్ టైం బోధనా సిబ్బంది నియామక దరఖాస్తు గడువు రేపటితో ముగుస్తుందని రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం తెలిపారు. ఫిబ్రవరి 28తో ముగియాల్సిన గడువును అభ్యర్థుల అభ్యర్థన మేరకు మార్చి 4 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

March 3, 2026 / 07:37 AM IST

ఎల్లమ్మ గుడి దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్

ASF: కాగజ్ నగర్‌లోని రేణుక ఎల్లమ్మ గుడిలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు DSP వహిదొద్దిన్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు మానుపాటి నరేష్‌ను మణికొండ గ్రామంలో అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడి వద్ద నుంచి అమ్మవారి బొట్టు బిళ్ల, సుమారు 10 గ్రాముల బంగారు ఆభరణాలు,1,250 గ్రాముల రెండు వెండి కిరీటాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

March 3, 2026 / 07:36 AM IST

ఒంగోలులో 8 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

ప్రకాశం: ఒంగోలు పరిధిలోని కొత్త డొంక ప్రాంతంలో సోమవారం పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 5,450 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలిసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 3, 2026 / 07:35 AM IST

పట్టణాన్ని పరిశుభ్ర పట్టణంగా మార్చాలి: ఎమ్మెల్యే

BDK: ఇల్లందు మున్సిపాలిటీ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే కోరం కనకయ్య నిన్న సమావేశం నిర్వహించారు. త్వరితగతిన వార్డులలో ప్రధాన సమస్యలు డ్రైనేజ్,వీధి ధిపాలు, త్రాగు నీరు, విధ్యుత్ స్ధంభాలు వంటి తదితర సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని పాలకవర్గానికి ఎమ్మెల్యే ఆదేశించారు. పట్టణాన్ని పరిశుభ్రత పట్టణంగా కౌన్సిలర్లు పనిచేయాలన్నారు.

March 3, 2026 / 07:35 AM IST

‘వ్యక్తిత్వ మార్పే సమాజానికి మార్గం’

E.G: కాతేరులో నైతిక విద్యా సదస్సులో ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. వ్యక్తి మారితేనే సమాజం మారుతుందని, మనం కట్టుబాటుతో జీవించడం కేవలం విద్య ద్వారా సాధ్యమని తెలిపారు. సెల్ ఫోన్ దుష్ప్రభావాలను నివారించి, పుస్తక పఠనం, క్రీడలు, యోగా అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు.

March 3, 2026 / 07:35 AM IST

ఉచిత నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

MDK: హవేలిఘనపూర్ ప్రభుత్వ ఐటీఐలోని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ATC)లో ఉచిత నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ప్రిన్సిపాల్ గుమ్మకొండ శ్రీనివాసులు తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) కింద పదో తరగతి ఉత్తీర్ణులు, ఇంటర్, డిగ్రీ మధ్యలో ఆపేసిన నిరుద్యోగులకు అధునాతన సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు.

March 3, 2026 / 07:34 AM IST

సమస్యల పరిష్కారం కొరకు కృషి

SRCL: బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో గత కొన్నేళ్లుగా మూతపడి ఉన్న వాటర్ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించారు. గ్రామంలో నీటి సరఫరాకు సంబంధించిన గేట్ వాల్స్, పైపు లీకేజీలు, హ్యాండ్ బోర్లనుకూడా మరమ్మతులు చేశారు. ఈ చర్యలతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొంగాని అశోక్ గౌడ్, మాజీ ఎంపిటిసి అక్కనపల్లి ఉపేందర్, పాల్గొన్నారు.

March 3, 2026 / 07:34 AM IST

గ్యాస్ లీక్.. పరిస్థితి విషమం

W.G: పెనుగొండ మండల శివాలయం సమీపంలో సోమవారం రాత్రి వంట గ్యాస్ లీకై నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. బాధితులు తమ్మ నాగేశ్వరరావు, లక్ష్మి, సమతం మణి, పల్లవిగా గుర్తించారు. వీరిలో మణి పరిస్థితి విషమంగా ఉండటంతో తణుకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తహసీల్దార్ అనితకుమారి బాధితులను పరామర్శించారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు.

March 3, 2026 / 07:33 AM IST

కలెక్టర్ ముందు అక్కాచెల్లెళ్ల ఆవేదన..!

NRML: ఆరేళ్లుగా కార్యాలయాల చుట్టూ ఐసీడీఎస్ అధికారి తిప్పించుకుంటున్నారని ఇద్దరు అనాథ అక్కాచెల్లెళ్లు కలెక్టర్ ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. సుమారు 600 సార్లు తిరిగినా అనాథ సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ ముందే సదరు అధికారి మళ్లీ వినతిపత్రం తీసుకోవడంపై మండిపడ్డారు.

March 3, 2026 / 07:32 AM IST

తపాలా కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

సత్యసాయి: కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సోమవారం హిందూపురంలోని ప్రధాన తపాలా కార్యాలయాన్ని తనిఖీ చేశారు. పొదుపు పథకాలు, ఆధార్ నమోదు, పార్శిల్ సేవలపై అధికారులతో సమీక్షించారు. ‘సుకన్య సమృద్ధి’ వంటి పథకాలను ప్రజలకు చేరవ చేయాలని, ‘పీఎం విశ్వకర్మ’ పార్శిళ్లను సకాలంలో పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి పరిశుభ్రత పాటించాలని ఆయన సూచించారు.

March 3, 2026 / 07:31 AM IST

నరసరావుపేటలో ‘మిషన్ శక్తి’ వాహనం ప్రారంభం

PLD: మహిళల భద్రత కోసం ‘మిషన్ శక్తి వన్ స్టాప్ సెంటర్’ అత్యవసర సేవల వాహనాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. ఆపదలో ఉన్న మహిళలకు తక్షణమే సాయం అందించే లక్ష్యంతో ఈ వాహనాన్ని 24 గంటలూ అందుబాటులో ఉంచుతున్నట్లు ఆమె తెలిపారు. మహిళలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.

March 3, 2026 / 07:30 AM IST

59 ఏళ్ల మహిళపై అత్యాచారయత్నం

CTR: గంగవరం మండలంలోని కొత్తూరు గ్రామంలో మహిళపై అత్యాచారయత్నం జరిగిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన 59 ఏళ్ల మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన కృష్ణప్ప మద్యం సేవించి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు సమాచారం. మహిళ గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

March 3, 2026 / 07:30 AM IST