• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మావోయిస్టు వారోత్సవాలు.. వాహనాల తనిఖీలు

KMM: వెంకటాపురం మండలం ఆలుబాక పంచాయతీ ముత్తారం క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టు వారోత్సవాలు నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మండలంలో ఎస్ఐ రవి ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ సిబ్బంది, సివిల్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. వచ్చి పోయే వాహనాలు ఆపి అనుమానిత వ్యక్తులు నుండి సమాచారాన్ని సేకరించి పంపిస్తున్నారు.

September 24, 2024 / 04:17 AM IST

‘అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి’

KDP: దువ్వూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం విజన్ -2047కు సంబంధించి మండల స్థాయి అధికారులతో మండల ప్రత్యేక అధికారి షేక్ ఇమ్రాన్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..మండలంలోని కీలక రంగాలపై దృష్టి సారించి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మండలాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను ఈనెల 30వ తేదీలోపు రూపొందించాలని తెలిపారు.

September 24, 2024 / 04:17 AM IST

బండరాయి కిందపడి వ్యక్తి మృతి

KDP: రాయచోటి మండల పరిధిలోని గొర్లముదివేడుకు చెందిన గౌనిపల్లి మల్లయ్య (55) రాళ్లను కొట్టి అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. రోజూ మాదిరిగానే గుట్ట వద్ద రాళ్లు కొడుతూ మట్టి తవ్వుతున్న క్రమంలో పెద్ద బండరాయి వచ్చి మీద పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

September 24, 2024 / 04:16 AM IST

100 రోజుల పాలనలో ప్రజలు సంతృప్తి: మంత్రి ఆనం

NLR: కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని 22వ వార్డు వీరారెడ్డిపల్లిలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని మంత్రి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.

September 24, 2024 / 04:16 AM IST

‘పెండింగ్ వేతనాలు చెల్లించండి’

CTR: బీ.ఎన్ కండ్రిగ మండలంలోని ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద పంచాయతీ గ్రీన్ అంబాసిడర్ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఏఐటియూసీ నాయకులు కత్తి ధర్మయ్య మాట్లాడుతూ.. గత 30 నెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను 15వ వార్షిక ఆదాయం ప్రకారం ప్రభుత్వ కమిషనర్ ప్రకటించిన విధంగానే వారికి బిల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు.

September 24, 2024 / 04:16 AM IST

“నేషనల్ పెన్షన్ స్కీంతో ఎన్నో ప్రయోజనాలు”

HNK: కాకతీయ విశ్వవిద్యాలయ అకుట్, నాన్ టీచింగ్ నాల్గవ తరగతి ఉద్యోగుల సంయుక్త నిర్వహణలో సెనేట్ హాల్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆది కవి నన్నయ్య యూనివర్సిటీ ఆచార్యులు ఆచార్య ఉదయభాస్కర్ హాజరయ్యారు. అనంతరం ఉద్యోగులను ప్రసంగిస్తూ.. నేషనల్ పెన్షన్ స్కీమ్‌తో చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఆదాయపు పన్ను రాయితీలు కుడా పొందవచ్చని తెలిపారు.

September 24, 2024 / 04:16 AM IST

‘సర్వాయి పాపన్నగుట్ట, రాయికల్ జలపాతం అభివృద్ధి కృషిచేస్తా’

KNR: సైదాపూర్ మండలంలోని సర్వాయిపేటలోని సర్వాయి పాపన్న గుట్టలను, రాయికల్ జలపాతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ హామి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడారు. రాయికల్ జలపాతం, సర్వాయి పాపన్న గుట్టలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాతనని మంత్రి మండల ప్రజలకు హామీ ఇచ్చారు.

September 24, 2024 / 04:14 AM IST

పక్కా ప్రణాళికతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట: జిల్లా ఎస్పీ

సత్యసాయి: పక్క ప్రణాళికతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు జిల్లాలో గంజాయి, ఇసుక, అక్రమ మద్యం వంటి అసాంఘిక కార్యకలాపాలు పూర్తిగా రూపుమాపే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ విరత్న తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. బార్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు, గంజాయి, రూపుమాపే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

September 24, 2024 / 04:14 AM IST

పీసా ఎన్నికలు వాయిదా: పీఓ

SKLM: షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నిర్వహించబోయే పీసా ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిందని సీతంపేట ఐటిడిఎ పీవో సి. యశ్వంత్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి పీసా ఎన్నికల తేదీలను మరలా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు గమనించాలని కోరారు.

September 24, 2024 / 04:14 AM IST

సోమశిలలో 245 క్యూసెక్కుల నీరు ఆవిరి

NLR: అనంతసాగరం మండలం సోమశిల జలాశయానికి సోమవారం ఎగువ ప్రాంతాల నుంచి 12,446 క్యూసెక్కుల కృష్ణా జలాలు వచ్చి చేరినట్లు జలాశయ ఈఈ దశరథ రామిరెడ్డి తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 51.128 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెన్నా డెల్టాకు 600 క్యూసెక్కులు, కండలేరుకు 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

September 24, 2024 / 04:14 AM IST

‘అనుమానితులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి’

KDP: అనుమానితులు లాడ్జిలలో బసచేస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని బ్రహ్మంగారిమఠం మండలం ఎస్సై చంద్రశేఖర్ అన్నారు. బ్రహ్మంగారిమఠం పట్టణంలోని లాడ్జిలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాడ్జిలో బసచేసే వారియొక్క వివరాలను రికార్డులలో నమోదు చేయాలని తెలిపారు. అనుమానితులు ఎవరైనా లాడ్జిలలో దిగితే వెంటనే సమాచారం పోలీసులకు తెలపాలని కోరారు.

September 24, 2024 / 04:13 AM IST

“అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో పరిశోధనలు జరగాలి”

HNK: కేయూ సెనేట్ హాల్లో జరిగిన సమావేశానికి ఈ రోజు ఎమ్మెల్సీ ఆచార్య ఎం. కోదండరామ్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయ స్వభావం రాజకీయ పార్టీలను బట్టి ఉంటుందని, తద్వారా ఆర్థిక అభివృద్ధి ఉంటుందని అన్నారు. ధరణి, కాళేశ్వరం, మిషన్ భాగీరధ లాంటి పథకాలలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. 10 సంవత్సరాల అభివృద్ధిపై క్షేత్ర స్థాయిలో పరిశోధనలు జరగాలన్నారు.

September 24, 2024 / 04:12 AM IST

వరకట్న వేధింపుల కేసు నమోదు

NDL: బండి ఆత్మకూరు మండలం జిసి పాలెంకు చెందిన రాణి అనే మహిళ అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇందులో భర్త ప్రతాప్, అత్త కుమారి, మామ రమేష్ వీరు కర్నూల్ పట్టణంకు చెందిన వారు అని ఎస్సై తెలిపారు. సంత జుటూరు గ్రామంకు చెందిన మౌలాలి వద్ద 10క్వార్టర్ సీసాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

September 24, 2024 / 04:11 AM IST

శ్రీకాళహస్తి ఆలయ నూతన ఈవోగా చంద్రశేఖర్ ఆజాద్

TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నూతన ఈవోగా ఎస్ఎస్.చంద్రశేఖర్ ఆజాద్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల అనంతరం ఆలయంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈవో మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

September 24, 2024 / 04:11 AM IST

‘ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు’

BPT: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు, పురుగు మందులు అమ్మాలని రేపల్లె వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు విజయబాబు అన్నారు. సోమవారం రేపల్లెలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ.. ఎరువులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు షాపు లైసెన్సును రద్దు చేస్తామన్నారు.

September 24, 2024 / 04:11 AM IST