WNP: మహిళా మనోవికాస్ వ్యవస్థాపకురాలు మాధవి రెండోసారి గిన్నిస్ బుక్ రికార్డుకెక్కారు. మాధవి నేతృత్వంలో 450 మంది మహిళలు 58,112 క్రోంచట్ స్క్వేర్స్ పై అతి తక్కువ సమయంలో రూపొందించి ప్రదర్శించి గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. ఈ గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ఈ బృందంలో వనపర్తికి చెందిన ప్రశాంతి ఉండటం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ASR: చింతపల్లి ఎంపీడీవో పీ. ఆశాజ్యోతి బదిలీ అయ్యారు. పాడేరు ఎంపీడీవోగా బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో చింతపల్లి ఎంపీడీవోగా ప్రేమ్ సాగర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆశాజ్యోతి పాడేరు ఎంపీడీవోగా త్వరలోనే బాధ్యతలను స్వీకరించనున్నారు.
NZB: శ్రీ చైతన్యవిద్యాసంస్థలపైనచర్యలుతీసుకోవాలని AISFజిల్లా సమితి అధ్వర్యంలో సోమవారంజిల్లావిద్యాశాఖ అధికారిదుర్గాప్రసాద్కువినతి పత్రంఅందజేశారు. జిల్లా అధ్యక్షురాలు అంజలి మాట్లాడుతూ.. శ్రీ చైతన్య విద్యా సంస్థలు సమయపాలన పాటించకుండా ఉ.9 నుంచి రాత్రి 8 గంటల వరకు క్లాసులు బోధిస్తూ విద్యార్థులను ర్యాంకుల పేరుతో మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
ASR: కొయ్యూరు ఎంపీడీవో మేరీ రోజ్ బదిలీ అయ్యారు. ఎంపీడీవో మేరీ రోజ్‌ను గొలుగొండ ఎంపీడీవోగా బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కొయ్యూరు ఎంపీడీవోగా బీ.రమేష్ నాయుడును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే వీరు తమ బాధ్యతలను చేపట్టనున్నారు.
కోనసీమ: ఆలమూరు మండలం జొన్నాడకు చెందిన వైసీపీ నాయకుడు కర్రి గంగిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి సోమవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జోనల్ ఇంఛార్జ్ కాశీరాజు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ మేరకు ఆయనకు కాశీరాజు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కొత్తపేట బీజేపీ ఇంఛార్జ్ సత్తిబాబు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ASR: గిరిజన గ్రామాల అభివృద్ధి, సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పాడేరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇంఛార్జ్ గిడ్డి ఈశ్వరి అన్నారు. గూడెం కొత్తవీధి మండలంలోని సంకాడ గ్రామంలో సోమవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛను పెంపు, మెగా డీఎస్సీ, ప్రకటించామన్నారు.
ASR: జీకేవీధి మండలం సీలేరుకు ఎట్టకేలకు 15 రోజుల తర్వాత సోమవారం రాత్రి బస్సు వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సీలేరు ప్రాంతం అతలాకుతలం అయింది. కొండచరియలు విరిగి పడి రోడ్లు దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. ఈమేరకు అధికారులు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. రహదారులు కొంతమేర బాగు చేయడంతో ఆర్టీసీ సేవలు పునరుద్ధరించారు.
VZM: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని రామభద్రాపురం ఎమ్మార్వో సులోచన రాణి సోమవారం తెలిపారు. భూముల రీసర్వే కారణంగా చాలా సమస్యలు రైతుల నుంచి వస్తున్నాయని, వాటిని పరిష్కరించడానికి ఆయా గ్రామాల్లోని వీఆర్వోలు, సర్వేయర్ల ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం చేశామని, మిగిలిన సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కార్యాచరణ తీసుకుంటామని తెలిపారు.
కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంగళవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 9 గంటలకు రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలోని కాపుకళ్యాణ మండపం వద్ద నిర్వహించే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక బ్యారేజ్ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తారని తెలిపారు.
VSP: రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈనెల 24వ తేదీ మంగళవారం రాత్రి నగరానికి రానున్నారు. రాత్రి 9.30 గంటలకు నగరానికి ఆయన చేరుకుంటారు. ఈనెల 25వ తేదీన ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులతో నగరంలోని ఒక హోటల్లో నిర్వహించే సమావేశంలో లోకేశ్ పాల్గొంటారు. అనంతరం రుషికొండ ఐటీ పార్కును సందర్శించి, అక్కడ ఉద్యోగులు, నిపుణులతో భేటీ అవుతారు.
AP: మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడతాయని, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని.. పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు జాగ్రత్...
WNP: మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని పల్లవి మోడల్ స్కూల్‌లో నిర్వహించిన 6 వ జూనియర్ ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్ లో పెబ్బేరు మండలానికి చెందిన క్రీడాకారులు సింధు, పూజ, లక్ష్మి, నందిని సోమవారం బంగారు పతకం కైవసం చేసుకున్నారు. బాలుర విభాగంలో బోన్స్ పథకానికి లోకేష్, అరవింద్, పారదసారథి, అభిలాష్, జస్వంత్ కైవసం చేసుకున్నట్లు ఉమాశంకర్ తెలిపారు.
VZM: పార్వతీపురం సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ సెక్రెటరీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐద్వా నాయకురాలు ఇంద్ర సోమవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు హెల్త్ సెక్రటరిలతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. తాము పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల మధ్య నలిగి పోతున్నామన్నారు. ఎన్సీహెచ్ఆర్ , ఆర్సీహెచ్ఆర్ సర్వేలు చేస్తున్నామని అయినా తమకు ఎలివేషన్స్ ఇవ్వడం లేదన్నారు.
తూ.గో: పేదల సంక్షేమమే తమ కర్తవ్యంగా అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కడియం మండలం కడియపులంకలో సోమవారం రాత్రి జరిగిన ఇది మంచి ప్రభుత్వం ప్రజా దర్బార్ కార్యక్రమానికి గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే రోజుల్లో కడియపులంక రూపురేఖలను పూర్తిగా మారుస్తామన్నారు.
KMM: నగరంలో ఈరోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ టీ దుకాణం వద్దకు మంత్రి సామాన్యుడిగా వెళ్లి డబ్బులు ఇచ్చి టీ తాగారు. అనంతరం అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మంత్రి వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.