AP: మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడతాయని, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని.. పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.