ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కందుకూరు మైన్ రోడ్లో టవర్ వర్కుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ… పట్టణంలో మండల విద్యాశాఖ కార్యాలయం ఏరియాలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కావున విద్యుత్ వినియోగ దారులు గమనించి, సహకరించాలని కోరారు.