VSP: కంచరపాలెం జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై అతివేగంగా డ్రైవ్ చేయడంతో పక్కనే ఉన్న డివైడెర్ని బలంగా ఢీ కొట్టారు. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మృతులు కప్పరాడకు చెందిన యువకులుగా స్థానికులు గుర్తించారు.