తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో అర్ధరాత్రి కుండపోత వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై వర్షపు నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరువన్నామలై, విల్లుపురానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై సహా ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.