ELR: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం శ్రీ కాత్యాయని పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డా, దాసరోజు శ్రీనివాసరావు మంగళవారం కొయ్యలగూడెంలో వినాయకుడి గుడి వద్ద నుండి భిక్షాటన చేస్తూ ద్వారకాతిరుమల వరకూ పాదయాత్ర చేపట్టారు. తిరుమలలో పవిత్రమైన శ్రీవారి ప్రసాదం కలుషితమై అపవిత్రమైనందుకు గాను పాప నిర్మూలన కోసం పాదయాత్ర చేపట్టినట్లు శ్రీనివాసరావు తెలిపారు.