లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 492 మంది మృతి చెందారు. మరో 1600 మందికి పైగా గాయపడ్డారు. కాగా, లెబనాన్‌పై ఈ స్థాయిలో భీకర దాడి.. 2006 నాటి ఇజ్రాయెల్-హెజ్బొల్లా యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడే జరిగింది.