TG: ప్రస్తుతం వైరల్ ఫీవర్ ప్రజలను వణికిస్తోంది. ఏ ఆసుపత్రి చూసినా జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా దీనిపై KTR స్పందించారు. ‘ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు. ఎవడి చావు వాడు చస్తాడు మాకేం సంబంధం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. బాధలతో జనం అల్లాడుతున్నా చలనం లేదు. చర్యలు లేవు. విష జ్వరాలు విజృంభించి ప్రజల ఒళ్ళూ, ఇళ్లూ గుళ్లవుతున్నా పట్టించుకునే నాధుడే లేడు’ అని ట్వీట్ చేశారు.