బాలీవుడ్ సినిమా ‘లాపతా లేడీస్’ భారత్ నుంచి 2025 ఆస్కార్‌కు ఎంపికైంది. ఈ మూవీలో నటించిన నటి ప్రతిభ రత్న ఆనందం వ్యక్తం చేశారు. ‘మా కష్టానికి ఫలితం దక్కింది. ఈ మూవీ మన దేశం నుంచి ఆస్కార్‌కు సెలెక్ట్ అవ్వాలని బలంగా కోరుకున్నాం. అది నెరవేరింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పని చేస్తూ పోతే రిజల్ట్స్ వాటంతట అవే వస్తాయి. నా విషయంలో అదే జరుగుతోంది’ అంటూ పేర్కొన్నారు.