ASR: రాజకీయ లబ్ధి కోసమే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. విదేశాల్లో ఉన్న ఆయన ఫోన్లో మంగళవారం అరకులోయ విలేకరులతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. వంద రోజుల పాలనలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు.