AP: తాను సనాతన ధర్మంపై పోరాడటానికి దిగితే దేశంలో ఆపేవాళ్లు ఎవరూ లేరని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మం కోసం తాను చచ్చిపోవడానికి కూడా సిద్ధమన్నారు. వైసీపీ నాయకులు మౌనంగా ఉండాలని.. కానీ హిందూధర్మంపై తప్పుడు కూతలు కూయొద్దని హెచ్చరించారు. కొందరు సెక్యూలరిజం పేరిట అయ్యప్ప స్వామి దీక్షపై ఇష్టరాజ్యంగా మాట్లాడితే హిందువులు చూస్తూ ఊరుకుంటున్నారని అన్నారు. ఒకసారి మక్కాను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.