SKLM: పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో ఉచిత కంటి పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ కేంద్రం మూతపడడంతో పలువురు స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రిలో గల E -EYE కేంద్రం మూతపడడంతో… ఆసుపత్రికి వచ్చిన వారు ప్రతి రోజు వెనుతిరిగి వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేటు కేంద్రాల వద్ద 1000 నుంచి 1500 రూపాయలు ఖర్చవుతుందని వాపోయారు. E-EYE కేంద్రం తెరవాలని కోరుతున్నారు.