AP: తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగుతోంది. ఈ క్రమంలో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. పండితులు ఆయనకు సాగర స్వాగతం పలికి.. వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించారు. అక్టోబర్ 1వ తేదీన తిరుమలకు వెళ్లనున్న పవన్.. అక్టోబర్ 2వ తేదీన స్వామివారిని దర్శించుకోనున్నారు.
MBNR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని ఎంపీ డికే అరుణ అన్నారు. సోమవారం సాయంత్రం మక్తల్ నియోజకవర్గం పరిధిలోని ఉట్కూర్ మండలం మొగ్దుమ్ పూర్ గ్రామంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండుగల నిర్వహించాలని, దేశంలో ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు.
BDK: భద్రాచలం మన్యంలోని గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో చేరవేయాలని ఐటిడిఏ పీవో రాహుల్ సూచించారు. సోమవారం ఐటీడీఏ లో నిర్వహించిన ప్రజాదర్బార్ వారు వినతిలను స్వీకరించారు. పరిష్కారం అధికారులకు పంపారు. అర్హులైన యువతకు అవసరమైన శిక్షణ అందించేందుకు వైటీసీ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ELR: పోలవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి సోమవారం ఎంపీపీ తాళాలు వేసి 12 మంది కార్యాలయ సిబ్బందిని నిర్బంధించిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి ఉదయం కార్యాలయానికి వచ్చి వెళ్లారు. మళ్ళీ సాయంత్రం మూడు గంటలకు ఆయన వచ్చేసరికి కార్యాలయంలో ఎంపీడీవో, సూపరింటెండెంట్, ఈవోపీఆర్డీ లేకపోవడంతో ఆగ్రహంతో కార్యాలయానికి తాళాలు వేశారు.
ఎన్టీఆర్: నందిగామ మండలం చందాపురం గ్రామంలో 132కేవీ, 33కేవీ, విద్యుత్తు లైన్ల మరమ్మతుల నిమిత్తం మంగళవారం వీరులపాడు మండలం పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 వరకు సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
అన్నమయ్య: జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పోలీస్ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో పరిష్కరించాలని ఎస్పీ విద్యా సాగర్ నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయం ప్రారంభంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్లు ఎస్పీ వివరించారు. జిల్లా నలు మూలల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 75 మంది హాజరయ్యారని చెప్పారు.
AP: కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై పోలీసులు కేసు నమోదుచేశారు. డాక్టర్ ఉమామహేశ్వరరావును దూషించిన కేసులో రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఫిర్యాదుపై నానాజీతో పాటు అతని అనుచరులపై సర్పవరం పోలీస్ స్టేషన్‌లో FIR ఓపెన్ చేశారు. ఇందులో ఏ1గా నానాజీ పేరు చేర్చారు. కాగా ఈ నెల 21న కాలేజ్ గ్రౌండ్‌లో వాలీబాల్ ఆడే విషయంలో వైద్యుడిని నానాజీ బూతులు తిట్టి తర్వాత క్షమాపణ చెప్పిన సంగతి తెలి...
VZM: అమెరికా పర్యటనకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. అమెరికాలో 10 రోజుల పాటు పర్యటిస్తారని మంత్రి క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. గ్రామీణ మహిళల అభ్యున్నతికి పెట్టుబడులు తెచ్చే నిమిత్తం అక్కడి ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అమెరికా పర్యటన అనంతరం అక్టోబర్ 3న జిల్లాకు ఆయన రానున్నారు.
VZM: మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి జలపాతంలో జిల్లాకు చెందిన ఇద్దరు మెడికల్ విద్యార్థులు ఆదివారం గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన కొసిరెడ్డి సౌమ్య మృతదేహం బొబ్బిలి పట్టణానికి సోమవారం రాత్రి చేరుకుంది. సౌమ్య మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మంగళవారం అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
KKD: కాకినాడ జిల్లా పరిషత్ పరిధిలో ఉద్యోగులను బదిలీ చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో మొత్తం 360 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 28 మంది ఎంపీడీవోలు కాగా 40 ఏవోలు, 61 జూనియర్ అసిస్టెంట్లు, 91 సీనియర్ అసిస్టెంట్లు, 41 టైపిస్టులు, 67 సబార్డినేట్లు, ఇద్దరు డ్రైవర్లు, 26 రికార్డ్ అసిస్టెంట్లు, నలుగురు ఇతర ఉద్యోగులు బదిలీలు అయ్యారు.
గోల్ఫ్ కోర్టు వద్ద అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను చంపేస్తానని.. కొన్ని నెలల ముందే ర్యాన్ రౌత్ ఓ లెటర్ రాశాడని యూఎస్ ప్రాసిక్యూటర్ పేర్కొంది. అతడు మందుగుండు సామగ్రి, ఓ మెటల్ పైప్, నిర్మాణ సామగ్రి, ఫోన్లు, కొన్ని లేఖలు ఉన్న పెట్టెను గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ముందు పడేశాడని ఆరోపించింది. ట్రంప్‌పై హత్యాయత్నం గురించి తెలిసిన తర్వాత ఆ లేఖ ఉన్న బాక్స్‌ను ఆ గుర్తుతెలియని వ్యక్...
VZM: నెల్లిమర్ల మండల పరిధిలో నిర్మించే బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు శంకుస్థాపన చేశారు. రాగోలు నుంచి మధుపాడ మీదుగా నెల్లిమర్ల-రణస్థలం రోడ్డు వరకు ఈ రహదారి నిర్మించనున్నారు. దీని కోసం రూ 2.9 కోట్లు నాబార్డ్ నిధులు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంబల్ల సుధారాణి, నాయకులు శ్రీరాములనాయుడు, సత్యనారాయణ పాల్గొన్నారు.
ASR: అరకు మండలం బీ.గంగగుడ్డి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణానికి సర్పంచ్ ఎం. జ్యోతి ఆధ్వర్యంలో వార్డు మెంబర్ వంతాల డేవిడ్, స్థానిక నేత బాలరాజు కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. 50 మీటర్ల డ్రైనేజీ నిర్మాణం కోసం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2లక్షలు కేటాయించినట్టు వారు తెలిపారు. గత కొంతకాలంగా ఇక్కడ డ్రైనేజీ లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ భారత్‌కు పయనమయ్యారు. US పర్యటనలో భాగంగా ఐరాస సదస్సులో మోదీ కీలక ప్రసంగం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఆర్మేనియన్ ప్రధాని నికోల్ పాషిన్‌యాన్ తదితర నేతలతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన జరగాలనే ఆకాంక్షను మోదీ పునరుద్ఘాటించారు.
కరీంనగర్ ప్రభుత్వ వృద్ధుల, వికలాంగుల ఆశ్రమం, స్వధార్ హోమ్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ, సివిల్ జడ్జి కే. వెంకటేష్ సోమవారం సందర్శించారు. వృద్ధులకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఆహార పదార్థాలను నిలువచేసే గదులను తనిఖీ చేశారు. ఆశ్రమాల్లో ఆహార పదార్థాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.