WGL: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని కంటెస్టెడ్ ఎమ్మెల్యే పగడాల కాళి ప్రసాద్ రావు అన్నారు. సింగరాజు పల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కాళి ప్రసాద్‌రావు పాల్గొని ఇంటింటికీ సభ్యత్వాలు చేపట్టారు. దామెర మండల అధ్యక్షులు జంగిలి నాగరాజు, సింగరాజుపల్లి బీజేపీ నేతలు పాల్గొన్నారు.
నిజామాబాద్ నగరంలో నేడు డీ2 సెక్షన్ పరిధిలో ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ తోట రాజశేఖర్ తెలిపారు. 11 కేవీ CH ఫీడర్ పరిధిలోని రాష్ట్రపతి రోడ్డు, గాంధీ చౌక్, హతయి గల్లి, హెడ్ పోస్ట్ ఆఫీస్, నెహ్రూ పార్క్, బీఎస్ఎన్ఎల్ ఆఫీస్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
VSP: ఉమ్మడి విశాఖ జిల్లా రెవిన్యూ శాఖలో పలు క్యాడర్లలో బదిలీలు జరిగాయి. 40 మంది డిప్యూటీ తహసీల్దారులను విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ బదిలీ చేశారు. వీరిలో అల్లూరి జిల్లాకు ఆరుగురు, అనకాపల్లి జిల్లాకు ఆరుగురిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ జిల్లాలో 28 మంది డీటీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముకుందాపురం నుంచి కట్టుగూడెం వరకు రూ.5 కోట్లు, మొండికుంట నుంచి రామచంద్రరావుపేట వరకు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్లకు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు.
NLR: నాయుడుపేట పట్టణంలోని ఎల్ ఏ సాగరం ఉన్నత పాఠశాలలో సోమవారం గూడూర్ డివిజన్ పరిధిలోని 150 మంది సైన్స్ ఉపాధ్యాయులకు ఇన్స్పైర్ తరగతులపై వర్క్ షాప్ నిర్వహించి, అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, శిక్షణలు ఇచ్చారు. విద్యార్థులకు సైన్స్ విజ్ఞానంపై ప్రత్యేకతలపై ఉపాధ్యాయులకు శిక్షణలు ఇచ్చారు. సైన్స్ జిల్లా అధికారి భాను ప్రసాదు, కోఆర్డినేటర్ రివేష్ తదితరులు పాల్గొన్నారు.
KMM: గ్రామాలలో ఓటర్ల జాబితా సవరణను త్వరతగతిన పూర్తి చేయాలని తాహసీల్దార్ కె. సునీత ఎలిజిబెత్ బిఎల్డీలను కోరారు. ముదిగొండ మండల పరిషత్తు కార్యాలయంలో బిఎల్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటర్లు జాబితాలో ఓటర్ల తప్పొప్పులను సరి చేసేందుకు ఓటరు ధ్రువపత్రాలతోపాటు, ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకోవాలన్నారు.
MHBD: గత కొన్ని రోజుల నుంచి SDC సర్వర్ సమస్య వల్ల,మీసేవ సర్వీసెస్‌లో సాంకేతిక సమస్యలు కలిగాయనీ జిల్లా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రశాంత్ తెలిపారు. దీన్ని పరిష్కరించడానికి ESD మీసేవ పెండింగ్‌లో ఉన్న అన్ని అప్లికేషన్లను మీ సేవ కేంద్రం ఆపరేటర్స్ లాగిన్లకు తిరిగి పంపించినట్లు తెలిపారు. దరఖాస్తు దారులకు సూచనలతో సమాచారాన్ని SMS రూపంలో పంపించామని పేర్కొన్నారు.
VZM: గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి ప్రభుత్వ ఐటీఐలో 4వ విడత మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ తెలిపారు. ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మోటారు మెకానిక్, కోపా, డ్రస్ మేకింగ్ సీట్లకు ఈనెల 26లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
HYD: బడికి డుమ్మా కొడితే ఇక పేరు తొలగించడమే. విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు సక్రమంగా వచ్చేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
SRCL: వేములవాడ పట్టణంలో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని, సెస్ ఎఈ తెలిపారు. విద్యుత్ మరమ్మత్తుల కారణంగా వేములవాడ పట్టణంలోని చెక్కపెల్లి రోడ్, భగవంతరావు నగర్, శ్యామకుంట,టెంపుల్, బద్దిపోచమ్మ ఏరియాలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు.
NLR: మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితోనే జిల్లాలో వైసీపీ బలోపేతం అవుతుందని రాష్ట్ర యువజన నాయకులు, మనుబోలు ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్ప గుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు. జిల్లాలో తిరిగి పార్టీ పుంజుకొని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎక్కువ సీట్లు గెలవడం తధ్యమన్నారు.
SKLM: బూర్జ మండలం కొల్లివలస గురుకుల పాఠశాలలో సోమవారం మాదక ద్రవ్యాల నిరోధక కమిటీలు ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ దేవానంద్ రావు అన్నారు. ఈ కమిటీల ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పించి, యువతను సన్మార్గం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కమిటీలు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బూర్జ పోలీస్ స్టేషన్ పీహెచ్‌సీ సిబ్బంది ఉమామహేశ్వరరావు, పీవీ రమణ పాల్గొన్నారు.
MHBD: పార్లమెంట్ పరిధిలో టీడీపీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని మాజీ పార్లమెంట్ అధ్యక్షుడు కొండపల్లి రామచందర్‌రావు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, టీడీపీ కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు.
ప్రకాశం: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించుట కొరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ దామోదర్ సోమవారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 115 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులో పరిష్కారించాలని పేర్కొన్నారు.
PLD: నరసరావుపేట మున్సిపల్ కమిషనర్‌గా సోమవారం జస్వంత్ రావు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని పలువురు కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రత్యేక చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా పనిచేస్తున్న రవిచంద్రారెడ్డి తన మాతృ సంస్థ అయిన వర్క్ అండ్ అకౌంట్స్ విభాగానికి బదిలీ అయ్యారు.