• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పీజీఆర్‌ఎస్‌కు 135 ఫిర్యాదులు

NDL: జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 135 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు. సోమవారం జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా ప్రతి పోలీస్ అధికారి చర్యలు చేపట్టాలని సూచించారు.

September 24, 2024 / 04:07 AM IST

నేడు ఖాజీపేటలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం

KDP: ఖాజీపేట మండలం పత్తూరు గ్రామ పంచాయతీలో మంగళవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హాజరుకానున్నారు. ఎన్డీఏ కూటమి వంద రోజుల పాలనపై ఎమ్మెల్యే పుట్టా ప్రజలకు వివరించనున్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

September 24, 2024 / 04:07 AM IST

వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: బాబురావు

కృష్ణా: వరద బాధితులు కష్టాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సర్వేలో వరద బాధితుల పేర్లు నమోదు కాకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారాన్ని తక్షణమే రూ.50,000కి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

September 24, 2024 / 04:07 AM IST

‘బీసీసీఐని చూసి పీసీబీ చాలా నేర్చుకోవాలి’

పాక్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ జట్టు వైఫల్యానికి PCBలోని కొందరి అహంకారమే కారణమని ధ్వజమెత్తాడు. ‘జట్టు ఎంపిక, కెప్టెన్, కోచ్ విషయంలో ప్రొఫెషనల్‌గా ఉండటాన్ని BCCI నుంచి PCB నేర్చుకోవాలి. వరల్డ్ క్రికెట్‌లో ఆధిపత్యం ప్రదర్శించాలన్నా, నం.1 జట్టుగా మారాలన్నా ఈ విషయాలు చాలా ముఖ్యం. కొందరి అహంకారం వల్లే పాక్‌ క్రికెట్ పరిస్థి...

September 24, 2024 / 04:05 AM IST

నేటి నుంచి ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం

CTR: ప్రభుత్వం ఈనెల 24 నుంచి 31వ తేది వరకు ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఏవో అమృత సోమవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మండలంలోని రైతుల పొలాలు సందర్శించి వారికి అవసరమైన సలహాలు ఇచ్చి వారితో మమేకవ్వడం, వారిని సాంకేతికంగా బలోపేతం చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యం అన్నారు. వారంలో మంగళ, బుదవారం ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.

September 24, 2024 / 04:05 AM IST

త్వరలో నూతన టెక్స్ టైల్స్ పాలసీ: చంద్రబాబు

GNTR: చేనేత, హస్తకళల రంగంలో ఉన్నవారి అభివృద్ధికి నూతన విధానాలు అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. గత ప్రభుత్వంలో సీఎం దాదాపు 2 సంవత్సరాల పాటు చేనేత, జౌళి, హస్తకళలపై సమీక్ష నిర్వహించలేదని అధికారులు తెలిపారు. దీంతో ఈ శాఖలో పరిస్థితులు, స్థితిగతులపై చంద్రబాబు సోమవారం సమగ్ర సమీక్ష చేశారు.

September 24, 2024 / 04:05 AM IST

పార్వతీపురంలో నేడు జాబ్ మేళా

మన్యం: జాబ్ మేళా కార్యక్రమాన్ని నేడు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.ఈ జాబ్ మేళాను ఉదయం 9.30 గంటల నుండి పార్వతిపురం ఐటిడిఏ గిరిమిత్ర సమావేశం మందిరంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ జాబ్ మేళాలో అవంతి ఫీడ్స్, అరబిందో ఫార్మా, జి ఏం‌‌‌ఆర్ రక్షా సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలు పాల్గొంటాయని పేర్కొన్నారు.

September 24, 2024 / 04:05 AM IST

‘పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యత’

W.G: పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఒమిక్స్ నెక్స్ట్ జెన్ లేబరేటరీస్, రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరీక్షలకు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును కలెక్టర్ నాగరాణి సందర్శించారు

September 24, 2024 / 04:04 AM IST

నేడు పమిడిముక్కలలో పర్యటించనున్న ఎంపీ బాలశౌరి

కృష్ణా: మచిలీపట్నం ఎంపీ బాలశౌరి నేడు మంగళవారం మండలంలోని మంటాడలో పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ చేస్తున్న పశ్చాత్తాప దీక్షకు మద్ధతుగా రేపు ఉదయం 11 గంటలకు గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే దీక్షకు సంఘీభావం తెలిపేందుకు బాలశౌరి రానున్నారు. ఈ మేరకు పామర్రు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తాడిశెట్టి నరేశ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

September 24, 2024 / 04:04 AM IST

విద్యార్థులకు కళాఉత్సవ్ పోటీలు : డీఈఓ

BHPL: విద్యార్థులలో కళాత్మక ప్రతిభను వెలికి తీయడానికి, విద్యార్థులలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడానికి, కళా ఉత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. రాజేందర్ అన్నారు. ఈ పోటీలలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల కళాశాల విద్యార్థులు అర్హులు అన్నారు.

September 24, 2024 / 04:04 AM IST

ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి: డీఎస్పీ

GNTR: ఆటో డ్రైవర్లు సరైన ధృవపత్రాలు కలిగి ఉండాలని ట్రాఫిక్ డీఎస్పీ ఎన్.రమేశ్ సూచించారు. ఎస్పీ సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లు, యూనియన్ నాయకులతో కూరగాయల మార్కెట్‌లో లోడింగ్, అన్ లోడింగ్ చేయడానికి వచ్చే డ్రైవర్లతో డీఎస్పీ మాట్లాడారు. ట్రాఫిక్‌కి ఇబ్బందులు లేకుండా చూసే విషయంలో బాధ్యత తీసుకోవాలని చెప్పారు.

September 24, 2024 / 04:04 AM IST

వైసీపీ జిల్లా అధ్యక్షులను కలిసిన మాజీ ఎమ్మెల్యే

ATP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటు గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనంతను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి వైసీపీ నూతన అధ్యక్షుడిగా నియామకం అయినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

September 24, 2024 / 04:02 AM IST

నేటి ఎమ్మెల్యే ధర్మరాజు పర్యటన వివరాలు

ELR: ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మంగళవారం ఉదయం 10.30 గంటలకు భీమడోలు మండలం గుండుగొలను పర్యటిస్తారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో ఇంటింటికి ఎమ్మెల్యే వెళ్లి వంద రోజుల్లో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరిస్తారన్నారు.

September 24, 2024 / 04:02 AM IST

నేడు ప్రాయిశ్చిత్త శాంతి హోమం

TPT: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో మంగళవారం ప్రాయశ్చిత్త శాంతి హోమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గురు ప్రసాద్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. లోక కళ్యాణార్థం ఉదయం 8 గంటలకు ప్రజల శ్రేయస్సు కొరకు ప్రాయశ్చిత్త శాంతి హోమం నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులు, ఉభయదారులు కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.

September 24, 2024 / 04:01 AM IST

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి శ్రీనివాస్

VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా అక్టోబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రభుత్వం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ప్రభుత్వ పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే.

September 24, 2024 / 04:01 AM IST