ఐఫోన్ యూజర్లకు కేంద్రం హై రిస్క్ హెచ్చరికలను జారీ చేసింది. IOS, ఐపాడ్, మ్యాక్, వాచ్, విజన్ OSలలో భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. వెంటనే IOS 18, 17.7కు ముందు ఉన్న వెర్షన్లు, ఐపాడ్ OS 18,17.7, మ్యాక్ OS సోనోమాలో 14.7, వెంచురాలో 13.7, సీక్వోయాలో 15, TV OS 18, వాచ్ OS 11, సపారీలో 18, X కోడ్‌లో 16, విజన్ OSలో 2కు ముందు ఉన్న వెర్షన్లను వీలైనంత […]
SDPT: సిద్దిపేటలోని అన్నపూర్ణేశ్వరి ఆలయంలో 49 రోజులపాటు ఉదయం, సాయంత్రం యజ్ఞం కొనసాగింది. చివరి రోజు అయిన 50వ రోజు గాయత్రి మహాయజ్ఞంతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. వేదమంత్ర పఠనంతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. వందమంది రుత్విక్‌లు వేయిమార్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు పఠిస్తూ పూర్ణహుతి నిర్వహించారు. పంచభూతాలను శుద్ధి చేసే కార్యక్రమంగా అభివర్ణించారు.
NLG: నల్గొండ మున్సిపాలిటీలోని మామిల్లగూడెంకి చెందిన బీజేపీ అధ్యక్షులు కంకణాల నాగిరెడ్డి మాతృమూర్తి కౌన్సిలర్ లక్ష్మమ్మ మరణించిన విషయం తెలిసిందే. ఆదివారం లక్ష్మమ్మ దశదినకర్మకు బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సత్యసాయి: ధర్మవరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ రెడ్డప్ప ఆదివారం రౌడీ షీటర్లు, పాత కేసుల్లో ఉన్న నిందితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి జీవించాలని సూచించారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరిపై పోలీసుల నిఘా ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎలాంటి సమస్యలు సృష్టించవద్దని పేర్కొన్నారు.
NZB: ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం ఎల్లారెడ్డి డివిజన్ కమిటీ ప్రెసిడెంట్‌గా ప్రదిప్ కుమార్‌ను ఆదివారం ఎన్నుకున్నారు. జనరల్ సెక్రెటరీగా పద్మారాజు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రమేష్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్‌గా కాశీరం, మండల, పట్టణ ప్రెసిడెంట్‌గా కిషన్, నరేష్, జనరల్ సెక్రెటరీగా శివనందం, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహేందర్ కోశాధికారిగా భూమేషు ఎన్నుకున్నారు.
అనంతపురం: నగరంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న శేఖర్ నివాసానికి వెళ్లిన మంత్రి సవితమ్మ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ శేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. సభ్యులకు మృతిని కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. అధైర్య పడవద్దని అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
NZB: గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషెస్ చెప్పారు. ఆయనను కలిసి అభినందించారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించినందుకు చిరంజీవికి ఈ అరుదైన అవకాశం దక్కిందన్నారు. వారి వెంట దిల్ రాజు ఉన్నారు.
NGKL: వంగూరు మండల కేంద్రంలోని శ్రీ గెల్వలాంబ మాత ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ గెల్వలాంబ మాత జాతర సందర్భంగా వచ్చిన ఉండి ఆదాయం లెక్కించగా రూ.1,61,600 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అక్కిన మోనిశేఖర్, ఉపాధ్యక్షుడిగా అక్కి మురళి గౌడ్‌ను ఎన్నుకున్నారు.
MDK: చిన్నశంకరంపేట ఎస్టీ హస్టల్ వార్డెన్ సత్యనారాయణ బదిలీ కాగా ఆదివారం వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా హస్టల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సత్యనారాయణను సన్మానించారు. పదేళ్ల పాటు హస్టల్ విద్యార్థులకు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్యనారాయణ, వేణుమాధవ్, సామాజిక కార్యకర్తలు మురళి, నర్సింలు, సిద్దార్థ పాల్గొన్నారు.
చిత్తూరు: వరదయ్య పాలెం మండలం సీఎల్ఎన్ పల్లి చావాలి ఎస్సీ కాలనీలో ఆదివారం కుక్కల దాడిలో 15 పొట్టేళ్లు మృతి చెందాయి. పాడి రైతులు రామకృష్ణయ్య, లక్ష్మయ్య, వేమయ్యకు చెందిన పొట్టేళ్లు మేత మేస్తుండగా ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 15 పొట్టేళ్లు మృతి చెందగా మరో ఏడు గాయపడినట్లు బాధితులు తెలిపారు. సుమారు రెండు లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
VZM: స్దానిక ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతి రాజు నేడు (సోమవారం) స్వచ్చత హీ సేవ 24 కార్యక్రమంలో భాగంగా మహరాజా జిల్లా ఆసుపత్రిలో ఉదయం 9.30 గంటలకు పారిశుధ్య కార్మికుల కోసం నిర్వహించే ప్రత్యేక వైద్య శిబిరంలోను ,10.30 కి విజ్జి స్టేడియంలో నిర్వహించే అండర్ 14 , అండర్ 17 స్కూల్ గేమ్స్ ను ప్రారంభించనున్నారని పార్టీ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
PDPL: కేయూ దూర విద్యా కేంద్రంలో డిగ్రీ, పీజీ చేయడానికి సెప్టెంబర్ -30 వరకు దరఖాస్తులకు అవకాశం ఉందని సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రామ చంద్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీ పాసైన వారికి అవకాశం ఉందన్నారు. దూర ప్రాంతాల వారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు 8341 3850 00 నంబరు సంప్రదించాలని సూచించారు.
కృష్ణ: ఆపరేషన్ బుడమేరులో భాగంగా ఆక్రమణలు గుర్తించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఆదివారం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు నుంచి విజయవాడ నగరం వరకు 40 గ్రామాల పరిధిలో సుమారు 2,700 ఎకరాల్లో బుడమేరు ప్రవహిస్తోందన్నారు. ఇందులో 270 ఎకరాల మేర పంట పొలాలు ఆక్రమణలకు గురైనట్లు తెలిపారు.
చిత్తూరు: కూటమి ప్రభుత్వం వందరోజుల పాలన దేశానికే ఆదర్శమని మదనపల్లె 25వ వార్డు టీడీపీ ఇంఛార్జ్ బి.రవి నాయక్, బి.శ్రీనివాసుల నాయక్ అన్నారు. ఆదివారం వారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించి స్టిక్కర్లను అంటించారు. వారు మాట్లాడుతూ.. సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు.
GDWL: అయిజ మండలంలోని మేడికొండ గ్రామ పంచాయితీని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని కొన్ని రోజులుగా డిమాండ్ కొనసాగుతుంది. ఆదివారం మేడికొండకు చెందిన ఈశ్వర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నా రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. మండలంలోనీ అతి పెద్ద గ్రామం మెడికొండ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు కావాలని కోరారు.