• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఏటిగట్లకు గండితో సాగు నీరు వృథా

తూ.గో: అధిక వర్షాల వల్ల ఖరీఫ్‌ వరి పంట నీట మునిగి కొంతమంది రైతుల నష్టపోగా ఉన్న పొలాలకు నీరు చేరే దారి లేకపోవడంతో మెట్ట ప్రాంత రైతులు తీవ్ర కలత చెందుతున్నారు. మండల పరిధిలో 17 గ్రామపంచాయతీల్లో సుమారు 10,045 ఎకరాల్లో వరి పంటలను సాగు చేసినట్టు మండల వ్యవసాయ శాఖ అధికారి కె.చంద్రశేఖర్‌ తెలిపారు.

September 23, 2024 / 05:59 AM IST

నేడు అనుమల వీడుకు ఎమ్మెల్యే ముత్తుముల

ప్రకాశం: మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేడు అన్నమాలవీడు గ్రామాన్ని ముత్తుముల అశోక్ రెడ్డి సందర్శించనున్నట్టు రాచర్ల ఎంపీడీవో వెంకటరామిరెడ్డి తెలిపారు. వంద రోజులు పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలుకు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని తెలిపారు. ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు.

September 23, 2024 / 05:58 AM IST

రైల్వే పనులు పూర్తి.. యథావిధిగా రైళ్లు

GDL: అలంపూర్ జోగులాంబ హాల్ట్ స్టేషన్‌లో గత పది రోజులుగా ప్లాట్ ఫామ్ పనులు చేపట్టడంతో స్టేషన్‌లో రైళ్లు రద్దు చేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న వేళ ఆదివారం సాయంత్రం నుంచి రైలు యథావిధిగా స్టేషన్‌లో ఆగుతాయని రైల్వే అధికారులు తెలిపారు. అలంపూర్ తాలూకా ప్రజలు రైలు ప్రయాణం చేసే వారికి ఈ సమాచారం చేరవేయాలని తెలిపారు.

September 23, 2024 / 05:58 AM IST

‘గురజాడ బాటలో పయనించాలి’

తూ.గో: గురజాడ అప్పారావు వంటి మహనీయులు చూపిన బాటలో అందరూ పయనించాలని లలిత ఇండిస్టీస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆదిశంకర్‌ అన్నారు. పెద్దాపురం చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో గౌరవాధ్యక్షుడు బుద్ధ శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన గురజాడ దేశభక్తి చిత్రలేఖన పోటీ విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు.

September 23, 2024 / 05:57 AM IST

నేడు కొండాపురంలో ఎమ్మెల్యే కాకర్ల పర్యటన

NLR: కొండాపురం మండలంలో సోమవారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పర్యటిస్తారని టీడీపీ మండల కన్వీనర్ మామిళ్ళపల్ల ఓంకార్ ఆదివారం తెలిపారు. ముందుగా ఆయన గ్రామానికి చేరుకుని ఓలేటి పాలెం- కొండాపురం డబుల్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తారన్నారని పేర్కొన్నారు.

September 23, 2024 / 05:56 AM IST

ఏలేరు ప్రాజెక్టును ఆధునికీకరించాలి: సీపీఎం

తూ.గో: ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు శాశ్వత పరిష్కారం చూపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దువ్వా శేషబాబ్జి డిమాండ్‌ చేశారు. ఆదివారం సామర్లకోట సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

September 23, 2024 / 05:55 AM IST

చిరంజీవిని అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

HYD: గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను కలిసి అభినందించారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించినందుకు చిరంజీవికి ఈ అరుదైన అవకాశం దక్కిందన్నారు.

September 23, 2024 / 05:55 AM IST

నేడు మిన్నే కల్లులో చేపల చెరువు వేలం పాట

బాపట్ల: సంతమాగులూరు మండలం మిన్నేకల్లు గ్రామ పంచాయతీ పరిధిలోని పాత చెరువులో రెండు సంవత్సరాలకు చేపలు వేసి పెంచుకొనుటకు నేడు వేలం పాట నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి బాజీ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11:30 గంటలకు మిన్నే కల్లు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ వేలంపాట నిర్వహించినట్లు తెలిపారు. వేలం పాటలో పాల్గొనే వారు రుసుము చెల్లించి పాల్గొనాలన్నారు.

September 23, 2024 / 05:55 AM IST

అకాల వర్షాలు.. పంటలకు నష్టం

NRPT: నర్వ మండల కేంద్రంలోని ఆయా గ్రామాలలో రైతులు పత్తి, కంది, ఆముదం ఇతర పంటలను దిగుబడి చేశారు. ఈ సంవత్సరం అకాల వర్షాలకు కొత్తపల్లి గ్రామంలో నెంబర్ కురుమయ్య తన చేనులో కందిపంట దిగుబడి చేశారు. ఎక్కువగా వర్షాల కారణంగా పంట మొత్తం పూర్తిగా చనిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నర్వ మండలంలోని రైతులు వ్యక్తం చేస్తున్నారు.

September 23, 2024 / 05:54 AM IST

మ్యూజిక్ టీచర్‌కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధానం

MBNR: మహమ్మదాబాద్ మండలం నంచర్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మ్యూజిక్ టీచర్ శ్యామలకు మహబూబ్‌నగర్ మహిళా సాహితీ సాంస్కృతిక సంస్థ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఆదివారం ప్రధానం చేసింది. జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల నుంచి ఆమెను ఉత్తమ టీచర్‌గా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో 0.U తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు కసిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

September 23, 2024 / 05:54 AM IST

నేడు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

NZB: నేడు నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంకు ప్రజలు హాజరై తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేయాలని కోరారు.

September 23, 2024 / 05:51 AM IST

ప్రత్తిపాడు ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

KKD: ప్రత్తిపాడు ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్య ప్రభ సోమవారం శంఖవరం మండలం పెద మల్లాపురంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు  ఆదివారం తెలిపాయి. గ్రామంలో ఉదయం పది గంటలకు జరిగే “ప్రజా వేదిక”  కార్యక్రమంలో  ఎమ్మెల్యే పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కార్యాలయ వర్గాలు తెలిపాయి.

September 23, 2024 / 05:49 AM IST

ప్రతి సబ్జెక్టుకు ఒక్క ఉపాధ్యాయుడిని నియమించాలి : మనోహర్ గౌడ్

WNP: ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను సవరించి, ప్రభుత్వ పాఠశాలలో ప్రతీ తరగతికి, సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని తపస్ జిల్లా ఉపాధ్యక్షుడు మనోహర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దమందడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రవికుమార్, జిల్లా సేవా కన్వీనర్ ఈశ్వర్ పాల్గొన్నారు.

September 23, 2024 / 05:48 AM IST

నేడు కాకినాడలో జాబ్ మేళా

KKD: కాకినాడ వికాస కార్యాలయంలో ఈరోజు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఈ మేళాలో ఐ అండ్ వీ బయో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ జాబ్‌మేళాకు పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు.

September 23, 2024 / 05:47 AM IST

ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆగ్రహం

ప్రకాశం: ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు.టంగుటూరులోని కొండపిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.‘చంద్రబాబుది మంచి మనసు అందుకే నువ్వు ఇంకా బయట తిరుగుతున్నావు. అదే స్థానంలో నేను ఉంటే నిన్ను బొక్కలో వేసేవాడిని’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

September 23, 2024 / 05:46 AM IST