KNR: పల్లె వెలుగు బస్సుల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులు సులభంగా ఛార్జీలు చెల్లించేందుకు క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే సూపర్ లగ్జరీ లాంటి బస్సుల్లో ఈ సదుపాయం ఉండగా… ప్రస్తుతం పల్లెవెలుగు బస్సుల్లోకి సైతం తీసుకొచ్చారు. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 డిపోలకు సంబంధించి 811 ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి.
BDK: పాల్వంచలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానికి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలిరాగా, సందడి నెలకొంది. కిన్నెరసాని జలాశయాన్ని, డీర్ పార్క్ దుప్పులను వీక్షించారు. 420 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా, వాహనాల ప్రవేశ రుసుం ద్వారా వైల్డ్ లైఫ్ శాఖకు రూ.12,350 ఆదాయం లభించగా, 190మంది బోటు షికారు చేశారు. రూ.9,200 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
SRCL: ముస్తాబాద్ మండలానికి చెందిన రిటైర్డ్ మండల విద్యాధికారి బత్తిని పరుశరాములు ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. మండలంలోని పోతుగల్ గ్రామానికి చెందిన పరశురాములు, గంభీ రావుపేట మండల MEOగా విధులు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో మండల జేఏసీ ఛైర్మన్‌గా పోరాటాలు చేశారు.
VZM: గుర్ల మండలం చోడవరం గ్రామంలో నక్కచిన్నయ్య అనే రైతుకు సంబంధించిన 25 గొర్రె పిల్లలు ఆదివారం కుక్కల దాడిలో మృతి చెందాయి. గొర్రె పిల్లల మృతితో తీవ్ర నష్టం జరిగిందని గొర్రెలపెంపకమే తమ జీవనోపాధని ఇప్పుడు మా పరిస్థితి ఏంటని రైతు వాపోతున్నాడు. పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం ఆదుకోవాలని, ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
MLG: అక్రమ వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ములుగు ఎస్పీ శబరిశ్ హెచ్చరించారు. పోలీస్, ప్రెస్ అంటూ అక్రమ వసూళ్లకు పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏటూరునాగారం, మంగపేటకు చెందిన రాంబాబు, సతీశ్, కార్తీక్, కమలాకర్, జనార్దన్, తాడూరు మధుకర్ అనే వ్యక్తులు పోలీసు, రిపోర్టర్లమని రాత్రివేళ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు.
కృష్ణా: నూజివీడు పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో సోమవారం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఆర్ నరేందర్ సింగ్ తెలిపారు. ఆసుపత్రిలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పారిశుద్ధ్య కార్మికులకు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆప్తమాలజీ, జనరల్ సర్జరీ, మెడికల్ క్యాంపు నిర్వహించటం జరుగుతుందన్నారు.
అనంతపురం: తాడిపత్రి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరంలో 93 మంది ఉచిత కంటి ఆపరేషన్లకు ఎంపికయ్యారని ప్రెసిడెంట్ అచ్యుత నాగేంద్ర తెలిపారు. 134 మంది ఉచిత వైద్య శిబిరానికి హాజరవ్వగా బెంగళూరు శంకర నేత్రాలయం వైద్యులు పరీక్షలు నిర్వహించగా 93 మంది ఉచిత కంటి ఆపరేషన్లకు ఎంపికయ్యారని తెలిపారు.
ప్రకాశం: మద్యం తాగి వాహనాలను అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమంతునిపాడు ఎస్సై కే మాధవరావు హెచ్చరించారు. ఆదివారం కనిగిరి– హనుమంతునిపాడు R&B రహదారిలో వాహనదారులకు ఎస్సై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే రూ.5 వేలు జరిమానాతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.
SKLM: 23 వార్డులు కిలిగిన ఇచ్ఛాపురం మున్సిపాలిటిలో మౌలిక వసతులు లేక నేటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దశాబ్దాలుగా తాగునీటి ఇబ్బందులే కొనసాగుతున్నాయని సరైన పరిష్కార మార్గం చూపడం లేదని వాపోయారు. జిల్లాలో శ్రీకాకుళం తరువాత ఇచ్ఛాపురం మూడు దశాబ్దాల కిందట మునిసిపాలిటీగా అవతరించిన సమస్యకు మోక్షం కలిగించే నాయకులు, అధికారులు లేరన్నారు.
చిత్తూరు: చంద్రగిరి పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ప్రాంతంలోని మహిళల శక్తి తిరుగులేనిదని ఆమె తెలిపారు. చంద్రగిరిలో 30 సంవత్సరాల చరిత్రను తిరగరాయడంలో మహిళలదే కీలక పాత్ర అని కొనియాడారు. ఎన్నికల సమయంలో మహిళలు తమకి ఎంతగానో అండగా నిలిచారని కొనియాడారు.
కడప: ఉమ్మడి కడప జిల్లాలో పనిచేస్తున్న ఫారెస్ట్ రేంజ్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ అధికారి చిరంజీవి చౌదరి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బద్వేల్లో పనిచేస్తున్న రమణారెడ్డిని కర్నూలుకు, కడప నుంచి నయీమ్ అలీని బద్వేల్‌కి, పీలేరు నుంచి రామ్ల నాయక్, వెంకటరమణను తిరుపతికి, రాజంపేట నారాయణ పలమనేరుకు, రాజంపేట రఘు శంకర్‌ను తిరుపతికి బదిలీ చేశారు.
NLR: కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీకి బాధ్యులైన వారిని వెంటనే ప్రభుత్వం ఉరితీయాలని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ బొబ్బేపల్లి సురేశ్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ముత్తుకూరులో మాట్లాడారు. పూర్తిస్థాయిలో ప్రభుత్వం విచారణ చేపట్టి ఇందులో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
ప్రకాశం: రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మధ్యాహ్నం 12 గంటలకు పామూరుకు వస్తున్నట్లు మండల టీడీపీ నాయకులు తెలిపారు. పామూరులో సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి రవికుమార్, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని, మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
PDPL: సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని 10 వవార్డులోని ఎంఈవో కార్యాలయం నుంచి దర్గాకు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే దారిలో రోడ్డుకు ఇరుపక్కల ఉన్న చెట్ల కొమ్మలు దట్టంగా, ఏపుగా పెరగడంతో రోడ్డుపై బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాజిక కార్యకర్త మహ్మద్ రఫీక్ మాట్లాడుతూ.. వెంటనే అధికారులు స్పందించి చెట్లను తొలగించాలని ఆయన కోరారు.
SKLM: మిత్ర అకాడమీ డైరెక్టర్ మజ్జి అప్పలసూర్యనారాయణ సౌజన్యంతో విజయవాడ వరద బాధితులకు అందించడానికి ఆదివారం నిత్యావసరాలను ఏర్పాటు చేశారు. రూ.2లక్షల నిత్యావసర వస్తువులు పంపిణి వాహనాన్ని శ్రీకాకుళం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ పి.జగన్మోహన రావు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు.