• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సత్యం సుందరం’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్ అయింది. రేపు సాయంత్రం 6 గంటలకు పార్క్ హయత్‌ హైదరాబాద్‌లో దీన్ని నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఈన...

September 22, 2024 / 11:33 AM IST

సీఎం సహాయనిధి ఎల్ఓసి పత్రం అందించిన ఎమ్మెల్యే

భద్రాద్రి: జూలూరుపాడు మండలం అనంతరం గ్రామానికి చెందిన సాలెపు ముత్తయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్య చికిత్సలు పొందేందుకు పేద కుటుంబం కావడంతో ఎమ్మెల్యేను ఆశ్రయించారు. కాగా స్పందించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదివారం సీఎం సహాయ నిధి ద్వారా ఒక లక్ష 30 వేల రూపాయల ఎల్ఓసి పత్రాన్ని అందజేశారు.

September 22, 2024 / 11:32 AM IST

ఘనంగా శ్రీ సత్యసాయి జన్మదిన వేడుకలు

కాకినాడ: తుని పట్టణంలో భగవాన్ శ్రీ సత్యసాయి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా భక్తులు ఆదివారం ఉదయం నిర్వహించారు. దీనిలో భాగంగా పట్టణంలో ప్రత్యేక ఆధ్యాత్మిక శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం క్షత్రియ కళ్యాణ మండపంలో ప్రత్యేకపూజ కార్యక్రమాలు సైతం నిర్వహించారు. వేలాదిగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు.

September 22, 2024 / 11:29 AM IST

24న ఎస్జీఎఫ్ బ్యాడ్మింటన్ ఎంపికలు

KMR: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అండర్- 17 బ్యాడ్మింటన్ ఎంపికలు ఈ నెల 24న నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి నాగమణి ఒక ప్రకటనలు తెలిపారు. కామారెడ్డిలోని ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న బ్యాడ్మింటన్ అకాడమిలో ఎంపికలు ఉంటాయన్నారు. ఆసక్తి గల వారు ఉదయం 9 గంటలకు ఒరిజినల్ బోనాఫైడ్‌తో హాజరుకావాలని సూచించారు.

September 22, 2024 / 11:29 AM IST

పోచారం ఐటీ కారిడార్‌లో భారీ చోరీ

TG: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. మక్త గ్రామానికి చెందిన నాగభూషణ్‌ ఇంట్లో రూ.2 కోట్లకుపైగా నగదు చోరీకి గురైంది. నగదుతోపాటు బంగారం కూడా చోరీ చేసినట్లు సమాచారం. దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.

September 22, 2024 / 11:29 AM IST

పుష్పక్ బస్సుల్లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్

HYD: శంషాబాద్ విమనాశ్రయానికి పుష్పక్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు TGSRTC శుభవార్త చెప్పింది. ఈ బస్సుల్లో విమానాశ్రయానికి వెళ్లే వారి కోసం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. సమూహంగా వెళ్తే 20 శాతం, ఒక్కరు వెళ్తే 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ కోరింది.

September 22, 2024 / 11:28 AM IST

సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న జిల్లా జడ్జి

NDL: పాణ్యం మండల పరిధిలోని శైవ పుణ్యక్షేత్రం ఎస్ కొత్తూరు గ్రామంలో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కర్నూలు జిల్లా జడ్జి కబర్థి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామకృష్ణ, వేద పండితులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేసి చేసి జడ్జిని సత్కరించారు.

September 22, 2024 / 11:27 AM IST

టీ అగ్రహారంలో పర్యటించిన టీడీపీ నాయకులు

KKD: శంఖవరం మండలం నెల్లిపూడి శివారు టీ అగ్రహారంలో ఎమ్మెల్యే సత్యప్రభ ఆదేశాలు మేరకు టీడీపీ నాయకులు ఆదివారం పర్యటించారు. సీసీ రోడ్లు స్మశానవాటికను పరిశీలించారు. గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు బద్ది రామారావు, బద్ది వెంకటరమణ పాల్గొన్నారు.

September 22, 2024 / 11:25 AM IST

‘టిఫిన్‌లో ప్రత్యక్షమైన ప్లాస్టిక్ పదార్థాలు’

MDCL: ఓహోటల్లో తింటున్న టిఫిన్లో భారీ ప్లాస్టిక్ పదార్థాలు ప్రత్యక్షమైన ఘటన ఆదివారం హబ్సిగూడాలో చోటుచేసుకుంది. ఉప్పల్‌కి చెందిన నాగరాజులు ఆదివారం టిఫిన్ చేయడానికి సుప్రబాత్ హోటల్‌కి వెళ్లి టిఫిన్ ఆర్డర్ చేశారు. టిఫిన్ తింటున్న సమయంలో అందులో భారీ ప్లాస్టిక్ పదార్ధాలు ప్రత్యక్షం అయ్యాయి. ఘటనపై అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

September 22, 2024 / 11:25 AM IST

‘రాష్ట్ర రైతు సదస్సును జయప్రదం చేయండి’

ELR: ఈనెల 27న ద్వారకా తిరుమలలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర రైతు సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని నారాయణపురం, గుణంపల్లి, ఎం.నాగులపల్లి, పంగిడిగూడెం గ్రామాలలో రైతు సంఘం నాయకులు ఆదివారం ప్రచారం నిర్వహించారు. ప్రచార కరపత్రాలను రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

September 22, 2024 / 11:23 AM IST

BREAKING: టీమిండియా ఘన విజయం

పాకిస్థాన్‌ను పాకిస్థాన్‌లో మట్టి కరిపించిన బంగ్లాదేశ్ భారత్‌లో మాత్రం చేతులెత్తేసింది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో దారుణ పరాజయం చవిచూసింది. 515 పరుగుల భారీ టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన బంగ్లా 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో 280 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అశ్విన్ 6, ...

September 22, 2024 / 11:22 AM IST

50 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

జగిత్యాల: అక్రమంగా నిల్వ చేసిన సుమారు 50 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్యాల మండలం ముత్యంపేటలోని వరదకాలువ శివారులో ఓ రేకుల షెడ్డులో రేషన్‌ బియ్యం నిల్వ చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటన స్థలానికి చేరుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకొని గోదాముకు తరలించారు.

September 22, 2024 / 11:21 AM IST

సందీప్ కిషన్ కొత్త సినిమా అప్‌డేట్

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. ‘SK-30’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రేపు ఉదయం 10:14 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘రెడీ అయిపోండి తమ్ముళ్లూ.. రేపు సౌండ్ అదిరిపోద్ది’ అంటూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాను AK ఎంటర్‌టైన్‌...

September 22, 2024 / 11:21 AM IST

రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

KRNL: రేపు జిల్లా కలెక్టరేట్‌లో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ను సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజినల్, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు.

September 22, 2024 / 11:20 AM IST

VIDEO: హైడ్రా అధికారులతో స్థానికుల వాగ్వాదం

SRD: అమీన్ పూర్ మండలంలోని పటేల్ గూడా ఐలాపూర్ కిష్టారెడ్డిపేట గ్రామపంచాయతీ పరిధిలో బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తుల నడుమ ఆదివారం తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు చేపట్టారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

September 22, 2024 / 11:19 AM IST