TG: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. మక్త గ్రామానికి చెందిన నాగభూషణ్ ఇంట్లో రూ.2 కోట్లకుపైగా నగదు చోరీకి గురైంది. నగదుతోపాటు బంగారం కూడా చోరీ చేసినట్లు సమాచారం. దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.