• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అక్రమ ఇంటి అనుమతులపై విచారణ

KNR: బొమ్మకల్‌లో అక్రమ ఇంటి అనుమతులపై డీఎల్‌పీవో శ్రీనివాస్‌ విచారణ నిర్వహించారు. రజ్వీచమన్‌లో పంచాయతీ అధికారులు అక్రమంగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని ఇటీవల కలెక్టర్‌ పమేలా సత్పతికి స్థానికులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీఎల్‌పీవో గ్రామపంచాయతీ కార్యాలయంలో అక్రమ ఇంటి అనుమతులపై వ్యవహారం పై విచారణ చేసారు.

September 22, 2024 / 10:59 AM IST

కంటి చూపు అందించడమే లక్ష్యం ఎమ్మెల్యే ఆకేపాటి

KDP: కళ్ళు కనపడక ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు కంటి చూపు అందించడమే లక్ష్యమని రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఒంటిమిట్ట ZP హైస్కూల్లో ఆకేపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

September 22, 2024 / 10:58 AM IST

తాత్కాలిక ప్రాతిపదికన అధ్యాపకుల నియామకం

WGL: కొడకండ్ల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో తెలుగు, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టుల్లో ఒక్కొక్క పోస్టు ఖాళీగా ఉందని ప్రిన్సిపల్ భాను ప్రసాద్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను రేపు (సోమవారం) సాయంత్రం 4 గంటలలోగా ఇవ్వాలని కోరారు. గతంలో పని చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.

September 22, 2024 / 10:57 AM IST

పిట్లంలో రాత్రి జోరుగా అక్రమ ఇసుక దందా

KMR: పిట్లం మండల కేంద్రంలో అక్రమ ఇసుక వ్యాపారం జోరందుకుంది. సంబంధిత ప్రభుత్వ విభాగాలు నిఘా పెట్టకపోవడంతోనే కొందరు ఇసుక వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

September 22, 2024 / 10:55 AM IST

రేపు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం

WGL: ఆర్టీసీ డయల్ యువర్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి తెలిపారు. డిపో పరిధిలోని మండలాలకు చెందిన ప్రజల, ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు వారి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. రేపు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సెల్: 9959226052, 73829261660లకు సంప్రదించాలని అన్నారు.

September 22, 2024 / 10:55 AM IST

పులివెందులలో కోటి రూపాయల భారీ చోరీ

KDP: పులివెందుల పట్టణంలోని కడప రోడ్డులో ఉన్న విజయ హోమ్స్‌లోని హరిప్రియ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు హరి నివాసంలో శనివారం రాత్రి దొంగలు పడ్డారు. ఈ చోరీలో సుమారు రూ.కోటి నగదును దుండగులు అపహరించి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐ జీవన్ గంగానాథ్ బాబుతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

September 22, 2024 / 10:55 AM IST

శ్రీశైలంలో అర్ధరాత్రి దారుణం

AP: నంద్యాల జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలో అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. పాతాళగంగ పాత మెట్ల మార్గంలో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో అశోక్ అనే వ్యక్తిని గొంతుకోశారు. మద్యం మత్తులో గొడవతో అశోక్ గొంతు కోసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హుటాహుటిన సున్నిపెంట ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అశోక్ మృతిచెందాడు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చే...

September 22, 2024 / 10:55 AM IST

పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు సన్మానం

SRD: జిల్లాలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను వీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ పీఆర్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ.. పదోన్నతితో ఉపాధ్యాయులు బాధ్యత పెరిగిందని చెప్పారు. ఉన్నత పాఠశాలలో మరింత మెరుగైన బోధన అందించాలని కోరారు.

September 22, 2024 / 10:54 AM IST

నీటి సమస్య పరిష్కారం కోసం రోడ్డెక్కిన ప్రజలు

ప్రకాశం: దోర్నాల మండలంలోని అయిన మొక్కల గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ ఆదివారం రహదారిపై ముల్లకంచవేసి బిందెల పట్టుకొని నిరసన తెలియజేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో నీటి సమస్య తలెత్తిందని ఉన్నతాధికారులు చొరవ చూపి నీటి సమస్య పరిష్కరించాలని ప్రజల కోరుతున్నారు.

September 22, 2024 / 10:54 AM IST

రామాలయంలో ప్రత్యేక అర్చనలు

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో ఆదివారం భాద్రపద బహుళ పంచమి తిథి పురస్కరించుకుని ఆలయ అర్చకులు తిరుమలగిరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారికి తులసి దళాలతో అష్టోత్తర శతనామ అర్చన నిర్వహించి మహ నైవేధ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస లక్ష్మీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

September 22, 2024 / 10:53 AM IST

కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు

కృష్ణా జిల్లా: నూజివీడు పట్టణంలోని ద్వారక ఎస్టేట్ ఆవరణంలో ఆదివారం వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన వంద రోజులలో గోరి కట్టిందన్నారు. లడ్డూ, పడవలు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు.

September 22, 2024 / 10:51 AM IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

ప్రకాశం: టంగుటూరు మండలంలోని గొల్లూరమ్మ దేవస్థాన సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆదివారం ఒంగోలు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వడ్లపూడి గ్రామం, గుంటూరు జిల్లా నుంచి తమిళనాడు రాష్ట్రం మధురైకు అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

September 22, 2024 / 10:50 AM IST

ప్రొద్దుటూరులో రిటైర్డ్ ప్రొఫెసర్ మృతి

KDP: కదిరి వ్యవసాయ పరిశోధనా సంస్థ రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ పూడూరు నరసింహారెడ్డి (86) ఆదివారం తెల్లవారుజామున ప్రొద్దుటూరులో మృతి చెందారు. తిరుపతి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. వేరుశనగలో రెండు రకాల కొత్త వంగడాలను అభివృద్ధి చేయడంలో ఆ బృందానికి నాయకత్వం వహించారు.

September 22, 2024 / 10:49 AM IST

రిజర్వాయర్ బాధితులకు రూ.4,70 కోట్లు పరిహారం మంజూరు

NGKL: బిజినేపల్లి మండలం మార్కండేయ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు 38 ఎకరాలకుగాను రూ.4 కోట్ల 70 లక్షలు బిల్లులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత శాఖ మంత్రి, అధికారులతో మాట్లాడి బిల్లులు మంజూరుకు చేసినందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

September 22, 2024 / 10:49 AM IST

పంట నష్టాన్ని ఆన్ లైన్‌లో నమోదు చేసుకోండి: ఎమ్మెల్యే నక్కా

BPT: ఇటీవల వరదల కారణంగా పంట దెబ్బతిన్న రైతులు వెంటనే పంట నష్టాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కోరారు. పంట నష్టం నమోదు ఆదివారం చివరి రోజు కావడంతో రైతులు వేమూరు నియోజకవర్గంలోని మండలాలలో అగ్రికల్చర్ ఆఫీసర్‌, క్షేత్ర సహాయకులను సంప్రదించి వెంటనే పంట నష్టం నమోదు చేయించుకోవాలన్నారు.

September 22, 2024 / 10:48 AM IST