MNCL: ప్రభుత్వ గురుకులాల్లో 5వ తరగతి, 6, 7, 8వ తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం ఈ నెల 22న TG-సెట్ నిర్వహించనున్నట్లు కాసిపేట బాలుర గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ వూటూరి సంతోష్ కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. నిర్దేశించిన కేంద్రాల్లో పరీక్ష ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్లైన్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.