శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని 39వ డివిజన్ కొత్త దమ్మల వీధిలో 10 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ ఏఈ సురేశ్ శుక్రవారం తెలిపారు. ఈ వీధిలో విద్యుత్ సమస్యలు ఉండడంతో ఎమ్మెల్యే గొండు శంకర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన కొత్త స్తంభాల ఏర్పాటుకు ఆదేశించారు.
SRCL: చాకలి ఐలమ్మ పోరాటం మరువలేనిదని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన గొప్ప వ్యక్తి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, వ్యవసాయ శాఖ అధికారి అబ్సల్ బేగం పాల్గొన్నారు.
MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామ స్టేజీ సమీపంలో వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్పందించిన వెలికట్ట గ్రామ యువకులు రోడ్లపై ఏర్పడిన భారీ గుంతలను మట్టితో పూడ్చి వేశారు. ప్రమాదాల నివారణకు కృషి చేసిన యువకులను గ్రామస్తులు అభినందించారు.
AP: పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాపై మాజీ మంత్రి అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు . ఈ సినిమా ప్రజాదరణ పొందలేకపోయిందని, కేవలం అభిమానులకు మాత్రమే నచ్చిందన్నారు. ఈ సినిమాలో అంత గేజ్ లేదని, అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయిందని చెప్పారు. అంతేకాదు జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ తాను రాజకీయ కక్షతో ఇలాంటి కామెంట్స్ చేశానని విమర్శిస్తారని తెలిపారు.
AP: పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాపై మాజీ మంత్రి అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు . ఈ సినిమా ప్రజాదరణ పొందలేకపోయిందని, కేవలం అభిమానులకు మాత్రమే నచ్చిందన్నారు. ఈ సినిమాలో అంత గేజ్ లేదని, అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయిందని చెప్పారు. అంతేకాదు జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ తాను రాజకీయ కక్షతో ఇలాంటి కామెంట్స్ చేశానని విమర్శిస్తారని తెలిపారు.
BDK: భద్రాచలం శాంతి నగర్ కాలనీలో శుక్రవారం వెంకటలక్ష్మి నూతన ఇందిరమ్మ ఇంటికి గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్‌రావు పాల్గొని రిబ్బన్ కట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేద ప్రజల సొంతింటి కల సహకారం చేయడం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్లాన్ గురించి ప్రధాని మోదీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈమేరకు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా టారిఫ్‌ల గురించి కూడా మోదీ, పుతిన్ చర్చించినట్లు పేర్కొన్నారు. చమురు కొనుగోలు కారణంగా భారత్‌పై విధించిన ట్రంప్ టారిఫ్‌లు రష్యాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.
NDL: దసరా మహోత్సవాల్లో భాగంగా ఇవాళ ఐదో రోజు శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ దేవి, భక్తులకు స్కందమాతగా దర్శనం ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా శ్రీ స్వామి, అమ్మవారికి శేష వాహన సేవలు నిర్వహించనున్నారు. అటు, భక్తులను అలరించేందుకు నిర్వాహకులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
VKB: ధరూర్ ఎస్సై రాఘవేందర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. వాగులు, చెరువుల వద్ద జాగ్రత్తగా ఉండాలని కోరారు. నీళ్లలోకి దిగి సాహసాలు చేయవద్దని అన్నారు. విద్యుత్ తీగల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
MDCL: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కుషాయిగూడ ధోబి ఘాట్‌లో & ECIL X Road వద్ద ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధీరత్వానికి, తెలంగాణ నేల పోరాట పటిమకు ప్రతీక అన్నారు. ఐలమ్మ త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు.
E.G: రాజమండ్రి సరస్వతీ ఘాట్ వద్ద ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతీ పీఠంలో 11వ శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ మహాలక్ష్మీ దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. సాయంత్రం పీఠం వద్ద కుమార పరిమళ హరిప్రియ బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగుతుందన్నారు.
MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా స్థానిక సంస్థల స్థానాల రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఓటరు జాబితా సిద్ధమవడం, ఇప్పుడు రిజర్వేషన్లు కూడా ఖరారవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. స్థానాల వారీగా గతంలో ఎవరికి రిజర్వు అయ్యాయి. ఈసారి ఏ కేటగిరీకి రిజర్వ్ అయ్యే అవకాశముందని బేరీజు వేసుకుంటున్నారు.
NRNL: జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ 14వ వార్డులో శుక్రవారం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నాయకులు పొన్నం నారాయణ గౌడ్, రాహుల్ గౌడ్ లు మాట్లాడుతూ.. నిర్మల్ పట్టణ అభివృద్ధి ద్యేయంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ముందుకు వెళుతున్నారని, పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంలో కృషి చేశారని కొనియాడారు.
RR: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో ఏఏంసీ డైరెక్టర్ చాకలి నరసింహా ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం దొరలపై తిరగబడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
VKB: ధరూర్ మండల పంచాయతీ అధికారి షఫీ ఉల్లాఖాన్ గ్రామపంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు చెరువులు పొంగుతున్నాయని, ప్రజలు అటువైపు వెళ్లకుండా చూడాలని సూచించారు. చెరువుల వాగుల వద్ద MPDW కార్మికులను ఉంచాలన్నారు.