NLG: జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పత్తి చేలకు వివిధ రకాల తెగుళ్లు సోకాయి. వర్షాలకు పత్తి చేలంతా ఎర్రబారి ఆకులు కాయలు రాలిపోతున్నాయి. దీంతో పత్తి సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, కట్టంగూర్, నార్కట్పల్లి,కనగల్ మండలాల్లో పత్తి చేలకు తెగుళ్లు వచ్చాయి.
ప్రకాశం: ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామంలోని పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్‌మాన్‌గా పనిచేస్తున్న ప్రసన్న కుమార్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు గత ఆరు నెలలుగా ఉత్తరాలు, ఆధార్, పాన్, ఓటర్ కార్డులు, రిజిస్టర్డ్ పోస్టులను పంపిణీ చేయలేదు. దీంతో హనుమంతరావు ఫిర్యాదుతో గురువారం తపాలా ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ తనిఖీ చేసి, మూడు బస్తాల్లో నిల్వ ఉన్న ఉత్తరాలను పరిశీలించారు.
AP: తన జీవితకాల గురువు సీఎం చంద్రబాబు అంటూ మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నామమాత్రంగా చదువుకునేవాడినని, ఫండమెంటల్స్ బలహీనంగా ఉండటంతో మంత్రి నారాయణ ప్రత్యేకంగా పాఠాలు చెప్పారని తెలిపారు. అమెరికా వెళ్లినప్పుడు ప్రొ.రాజిరెడ్డి విద్యా వ్యవస్థ గురించి విలువైన విషయాలు చెప్పారన్నారు. వీరి కృషి వల్లే ఈ రోజు ప్రజల ముందు ఉన్నానని లోకేష్ అన్నారు.
కృష్ణా: అసెంబ్లీలో కార్మికుల సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించకపోతే ఎంపీ,ఎమ్మెల్యేల కార్యాలయాలను ముట్టడిస్తామని కార్మికుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ కొండ గురువారం హెచ్చరించారు. ఐదు రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై మంత్రులు,ఎమ్మెల్యేలు ప్రస్తావించకపోవడం సిగ్గుచేటన్నారు. అక్టోబర్ 15 లోపు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి అని తెలిపారు.
PDPL: ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులతో అభివృద్ధి పనులపై గురువారం సమీక్షించారు. పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తిచేయాలని, ప్రజలకు తక్షణ అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు.
SRD: ఆర్ఆర్ఆర్ కోసం బలవంతపు భూ సేకరణ నిలిపివేయాలని కోరుతూ నెల 27వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ కోరారు. సంగారెడ్డిలో ఇవాళ ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తుందని ఆరోపించారు. దీన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు.
PPM: కేంద్ర ప్రభుత్వ పథకాలు యువతకు చేరవేయాలని పార్వతిపురం కమిషనర్ జి శ్రీనివాసరాజు అన్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించు కోవాలన్నారు.
KNR: మానవతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నతుడు పండిట్ దీన్ దయాల్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గురువారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య: మదనపల్లెలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ కన్యకా పరమేశ్వరి అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం ప్రకాష్ మాట్లాడుతూ.. సాయంత్రం అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు.
SRPT: ప్రభుత్వ హాస్పిటల్‌లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలంటూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో BJP జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి, మాజీ MLA శానంపూడి సైదిరెడ్డి సంఘీభావం తెలిపారు. 6 నెలలుగా వేతనాలు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని పేర్కొన్నారు. వెంటనే బకాయిలు చెల్లించకపోతే BJP పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు.
SRD: జిల్లాలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న రసాయన పరిశ్రమలు మూసివేయాలని ఆమ్ ఆద్మీ సెంట్రల్ కమిటీ సభ్యులు రాజేశ్వర్ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. గుమ్మడిదల మండలం దోమడుగు సమీపంలోని రసాయన పరిశ్రమలు పొలాల్లోకి కాలుష్య జలాలను వసతులున్నాయని ఆరోపించారు. ఈ పరిశ్రమలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ADB: బుధవారం రాత్రి విడుదలైన ఫలితాలు ఆదిలాబాద్ జిల్లా బోరజ్ గ్రామానికి చెందిన సరసన్ శశిధర్ రెడ్డి గ్రూప్-1 ఉద్యోగం సాధించాడు. కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ ట్రెజరర్ ఆఫీసర్‌గా మల్టీ జోన్ వన్‌కు ఎంపిక అవ్వడం పట్ల సంతోషంగా ఉందని శశిధర్ అన్నారు. నిరంతర కృషి పట్టుదలతో సాధించలేనిది లేదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు లక్ష్య సాధనకై పనిచేయాలని కోరారు.
KDP: చెక్కభజన కళాకారుల కడప జిల్లా కమిటీలో ఉపాధ్యక్షుడిగా బ్రహ్మంగారి మఠం వాస్తవ్యులు గురయ్యను ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా మైదుకూరు నియోజకవర్గం చెక్కభజన కళాకారుల కమిటీకి గురు ప్రసాద్‌ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ మేరకు సలహాదారునిగా వెంకట సుధా సౌండ్ సిస్టం ప్రొఫెటర్ భాస్కర్ రెడ్డిని ఎన్నుకున్నారు. వీరిని బ్రహ్మంగారి మఠం చెక్కభజన కళాకారులు ఘనంగా శాలువాలతో సన్మానించారు.