RR: రాష్ట్రీయ స్వయంసేవక సంఘం (RSS) ప్రారంభించి 2025 సంవత్సరం విజయదశమి పండుగకు వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హయత్ నగర్ వినాయక నగర్ కాలనీ కమిటీ హాలులో విజయదశమి ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక, నైతిక సంప్రదాయాలను పరిరక్షించడం ఆశయమన్నారు.
MLG: జిల్లా స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో మంత్రి సీతక్కకు కొత్త తలనొప్పి ఎదురైంది. ములుగు జడ్పీ పీఠం ఎస్టీ మహిళలకు, 3 జడ్పీటీసీలు, 4 ఎంపీపీలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో ఇతర వర్గాల నేతలు నిరాశకు గురయ్యారు. మార్కెట్ కమిటీ ఎస్టీలకు ఇచ్చినా, జనరల్ అయిన గ్రంథాలయ సంస్థ పదవికి ఎస్టీ నేతను నామినేట్ చేయడం తప్పని విశ్లేషకులు భావిస్తున్నారు.
TPT: ఏర్పేడు మండలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ ఆమందూరు గ్రామ దేవత ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామాల నుంచి భారీగా మహిళా భక్తుల తరలివచ్చి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు భారీగా పాల్గొన్నారు.
KKD: కరూర్‌లో నటుడు, TVK పార్టీ అధ్యక్షులు విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట దురదృష్టకరం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 39 మంది మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనైనట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని.. క్షతగాత్రులకు తమిళనాడు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
NGKL: అచ్చంపేట మున్సిపాలిటీలోని గిరిజన భవన్ నుంచి ప్రధాన రహదారి పెట్రోల్ బంక్ వరకు రూ.15 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. అచ్చంపేట పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
MDCL: బోడుప్పల్ కార్పొరేషన్ లక్ష్మీగణపతి కాలనీ వాసులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ.. కృతికా ఇన్ఫ్రా కంపెనీ “డెవలప్‌మెంట్” పేరుతో 3 ఎకరాల భూమిని తీసుకొని, 25 ఫీట్ల లోతు తవ్వి వదిలేశారని వెల్లడించారు. దీంతో వర్షాకాలంలో ఆ గుంటలు నీటితో నిండిపోతూ, ప్రహరి గోడలకు ఆనుకొని ఉన్న ఇళ్లకు ప్రమాదకరంగా మారిందన్నారు.
WNP: బీసీలను మరోసారి మోసం చేసి ఓట్లు దండు కోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పత్రిక సమావేశములో ఆరోపించారు. బీఆర్ఎస్ టౌన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి బీసీలకు పొందుపరిచిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
JGL: జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం కార్యక్రమంలో గొల్లపల్లి మండల BRS అధ్యక్షుడు గోస్కుల జలందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ ఆలోచనలను అనుసరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
దుర్గా నవరాత్రుల సందర్భంగా ప్రజలు శక్తి ఉపాసన చేస్తారని ప్రధాని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా నారీ శక్తికి నిదర్శనంగా ఉత్సవాలు నిర్వహిస్తారని.. అన్ని రంగాల్లో మహిళలు ప్రతిభ చాటుతున్నారని కొనియాడారు. సముద్రంలో ఇద్దరు మహిళలు 8 నెలలపాటు 50 వేల కి.మీ యాత్ర చేశారని వెల్లడించారు. లెఫ్టినెంట్ కమాండర్లు దిల్‌నా, రూప ధైర్యసాహసాలు ప్రదర్శించారని ప్రశసించారు.
MNCL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లకు ప్రస్తుతం 146.81 మీటర్లకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు ప్రస్తుతం 16.9174 టీఎంసీలకు చేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 2,75,000 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 10348 క్యూసెక్కుల వరద చేరింది.
వరంగల్: నర్సంపేట పట్టణ పరిధిలో దసరా పండుగ పురస్కరించుకుని వివిధ గ్రామాల ప్రజలు ఉదయం 10 నుంచి నర్సంపేట సంత వచ్చి గొర్రెల కొనుగోలు చేస్తున్నారు. పండగగకు మూడు రోజులు గడువు మాత్రమే ఉండడంతో గొర్రెలకు అధిక ధరలు చెబుతున్నట్లు ప్రజలు తెలిపారు. దీంతో అంగడి ఆవరణం మొత్తం రద్దీగా మారడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు .
MNCL: జిల్లా కేంద్రంలోని రాళ్ళవాగులో మునిగి ఒక యువకుడు మరణించాడు. స్థానిక ఎన్టీఆర్ నగర్‌కు చెందిన చింతల రాకేష్ అనే యువకుడు ఆదివారం ఉదయం సమీపంలోని రాళ్ళవాగులో చేపల వేటకు వెళ్లాడు. వాగులో నీటి ఉద్దృతి అధికంగా ఉండడంతో రాకేష్ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు.
NLG: నల్లగొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ఆడబిడ్డలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మన తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే పండుగ బతుకమ్మ అని అన్నారు. మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
RR: గ్యాస్ లీకై మంటలు చెలరేగిన ఘటన షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. మల్లపూర్ గ్రామంలోని దర్శన్ అనే వ్యక్తి ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై స్థానికుల సహాయంతో మంటలు ఆర్పి వేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
SKLM: నెహ్రూ యువ కేంద్రంలో అక్టోబర్ 7న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి సాయికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ నేషనల్ మోడలేజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో టీమ్ మెంబెర్ ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ITI, డిప్లమాలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.