RR: గ్యాస్ లీకై మంటలు చెలరేగిన ఘటన షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. మల్లపూర్ గ్రామంలోని దర్శన్ అనే వ్యక్తి ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై స్థానికుల సహాయంతో మంటలు ఆర్పి వేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.