పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం “తంగళన్”లో యాక్ట్ చేస్తున్న నటుడు చియాన్ విక్రమ్ రిహార్సల్స్ చేస్తున్న క్రమంలో అనుకోకుండా కింద పడ్డారు. దీంతో ఆయన పక్కటెముక విరిగిందని అతని బృందం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో విక్రమ్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా..ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చియాన్ ను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినట...
భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల కోసం ఐదేళ్ల క్రితమే ప్రారంభించామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు.
వరుస సినిమాలు చేయాలని అనుకుంటున్న సమయంలో ఆ ఫ్లాప్ తో కోలుకోలేని దెబ్బతిన్నాడు. ఓటమి నుంచి తేరుకుని తన తదుపరి సినిమాలపై దృష్టి సారించాడు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పలేదని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అన్నారు.
కర్ణాటకలో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఓ అభ్యర్థి సోదరుడి ఇంటిలో మామిడి చెట్టుపై డబ్బులను దాచాడు. అధికారులు రైడ్ చేసి, స్వాధీనం చేసుకున్నారు.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తమిళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యింది. మనోబాల మృతికి హీరోహీరోయిన్లు, దర్శక, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
మధ్యాహ్నం సమావేశం ప్రారంభం కాకుండానే బీజేపీ కార్పొరేటర్లు రెచ్చిపోయారు. హైదరాబాద్ నగరంలో నెలకొన్న సమావేశాలపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన (Protest) చేశారు. ఈ క్రమంలో అధికారులను ఉద్దేశించి ‘సిగ్గుందా’ అంటూ బీజేపీ కార్పొరేటర్లు దూషించారు.
మెగా డాటర్ నిహారిక కొణిదెల మళ్లీ యాక్టింగ్ బాట పట్టారు. పెళ్లి తర్వాత దూరంగా ఉన్న ఆమె.. డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించారు.
హైదరాబాద్ వాసులకు నేటి నుంచి నీరా అందుబాటులోకి రానుంది. హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.
మాల్స్ యాజమాన్యాలు ఇప్పటివరకు చేసిన ఐటీ చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాగ్ షీట్స్, ఆడిటింగ్ వివరాలను పరిశీలిస్తున్నారు. సంస్థ ఫైనాన్స్ మేనేజర్లను అధికారులు విచారిస్తున్నారు. కాగా ఈ తనిఖీల నేపథ్యంలో షాపింగ్ మాల్స్ లో వినియోగదారులను అనుమతించడం లేదు.
ఉత్తరాంధ్ర జాబ్ హబ్‌గా మారబోతుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఈ రోజు ఆయన శంకుస్థాపన చేశారు.
జూపార్క్ సందర్శన టికెట్ ధరలు పెంచేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. సెలవు రోజుల్లో పెద్దలకు రూ.80, సాధారణ రోజుల్లో రూ.70, ఇక పిల్లలకు సాధారణ రోజుల్లో రూ.45, సెలవుల్లో రూ.55 ధరలు పెంచాలని నిర్ణయించింది.
సిట్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఊరట కలిగింది.
వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులు అందరూ కలిసి 34 మందితో ఓ బస్సు పెళ్లి కోసం మంగళవారం బయల్దేరింది. పెళ్లి అనంతరం భోజనం చేసి తిరుగుప్రయాణమయ్యారు. మార్గమధ్యలో రాత్రి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
మహ్మద్ షమీ భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. షమీ కొట్టేవాడు అని.. ఇప్పటికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయని పిటిషన్‌లో వివరించారు.