»Telangana Hyderabad Nehru Zoological Park Ticket Prices To Go Up
Zoological Park పర్యాటకులకు షాక్.. భారీగా పెరిగిన జూపార్క్ ధరలు
జూపార్క్ సందర్శన టికెట్ ధరలు పెంచేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. సెలవు రోజుల్లో పెద్దలకు రూ.80, సాధారణ రోజుల్లో రూ.70, ఇక పిల్లలకు సాధారణ రోజుల్లో రూ.45, సెలవుల్లో రూ.55 ధరలు పెంచాలని నిర్ణయించింది.
పర్యాటకులకు (Tourist) భారీ షాక్ తగిలింది. విహారం కోసం పార్క్ (Park)కు వెళ్లితే భారీగా డబ్బులు చెల్లించుకోవాల్సిందే. ఇక నుంచి హైదరాబాద్ (Hyderabad)లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ (Nehru Zoological Park) టికెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. పార్క్ ను సందర్శించే (Visitors) వారు అధిక ధర చెల్లించాల్సిందే. ఇన్నాళ్లు తక్కువ ధరతో ఉండగా.. ఇప్పుడు ఆ టికెట్ల ధర (Ticket Price) పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలోనే పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి.
జూపాట్ (జూపార్క్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) (Zoo Parks Authority of India) పాలకమండలి సమావేశం మంగళవారం నిర్వహించారు. తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో జూపార్క్ సందర్శన టికెట్ ధరలు పెంచేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. సెలవు రోజుల్లో పెద్దలకు రూ.80, సాధారణ రోజుల్లో రూ.70, ఇక పిల్లలకు సాధారణ రోజుల్లో రూ.45, సెలవుల్లో రూ.55 ధరలు పెంచాలని నిర్ణయించింది. ఇక జంతువులను దత్తత తీసుకునే సదుపాయాన్ని మరింత విస్తరించాలని జూపాట్ మండలి నిర్ణయించింది. 60 సంవత్సరాలు పూర్తయిన జూపార్క్ ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఇక వీటితో పాటు మహబూబ్ నగర్ (Mahabub Nagar)లోని పిల్లలమర్రి పార్క్ (Pillalamarri Park), హనుమకొండలో కాకతీయ జూపార్క్, కరీంనగర్ లోని లోయర్ మానేర్ జింకల పార్క్, పాల్వంచలోని కిన్నెరసాని జింకల పార్క్ లు, హైదరాబాద్ (Hyderabad)లోని కేబీఆర్ పార్క్, శివారు ప్రాంతాల్లోని మృగవని, హరిణి వనస్థలి, ఇతర పట్టణ పార్కుల్లో సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించింది. పెద్దపులి, సింహం వంటి జంతువులను అతి దగ్గరి నుంచి చూసేలా ఎన్ క్లోజర్లకు గ్లాస్ పార్టిషన్ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ జూపార్క్ 6 అక్టోబర్ 1963లో ప్రారంభమైంది. 380 ఎకరాల్లో ఈ పార్క్ విస్తరించి ఉంది. 1,500 జాతుల జంతువులు, పక్షులు ఈ పార్క్ లో ఉన్నాయి. తెలంగాణ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పార్క్ కొనసాగుతున్నది. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరు ఈ పార్క్ కు నామకరణం చేశారు.