»Brs Party Tandur Mla Pilot Rohith Reddy Fire On Ex Minister Patnam Mahender Reddy
Tandurకు 25 ఏళ్లు మరుగుజ్జు ఏం చేశాడు? తాండూరు ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
ఇక తానే స్థానిక నాయకుడినని ఎమ్మెల్యే చెప్పారు. ‘ఇక్కడే పుట్టా. ఇక్కడే చస్తా.. చచ్చాక తాండూరులోనే బొంద పెట్టండి’ అంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాండూరు ఎమ్మెల్యే టికెట్ తనదేనని మరోసారి ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీలో (BRS Party) ఇంకా అసంతృప్తులు చల్లారలేదు. ఇద్దరు బలమైన నేతలు ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలింది. చేరికలతో ఈ పరిస్థితి ఏర్పడింది. అధిష్టానం సర్దుకుని పోవాలని పదే పదే చెబుతున్నా.. గ్రూపు రాజకీయాలు (Group Politics) బహిర్గతమవుతూనే ఉన్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా (Vikarabad District) తాండూరులో మరోసారి గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై (Patnam Mahender Reddy) ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేందర్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరుగుజ్జు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
తాండూరులో (Tandur) మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి (Pilot Rohith Reddy) మాట్లాడుతూ.. మహేందర్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ‘మహేందర్ రెడ్డి ఓ మరుగుజ్జు.. మిమ్మల్ని మోసం చేసేందుకు మళ్లీ వస్తున్నాడు. తాండూరు తనదే అంటున్న మహేందర్ రెడ్డి నిజానికి చెప్పాలంటే ఆయన నాన్ లోకల్ (Non Local). పాతికేళ్ల పాటు తాండూరును పాలించిన ఓ మరుగుజ్జు మాజీ మంత్రి ఏం చేశాడని మళ్లీ మీ ముందుకు వస్తున్నాడు?’ అని నిలదీశాడు. ఇక తానే స్థానిక నాయకుడినని ఎమ్మెల్యే చెప్పారు. ‘ఇక్కడే పుట్టా. ఇక్కడే చస్తా.. చచ్చాక తాండూరులోనే బొంద పెట్టండి’ అంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాండూరు ఎమ్మెల్యే టికెట్ (MLA Ticket) తనదేనని మరోసారి ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీలో తారస్థాయిలో విబేధాలు ఉన్నది తాండూరు నియోజకవర్గంలోనే. ఈ నియోజకవర్గంలో పైలెట్ రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం ఉంది. గతంలో వీరిద్దరూ ప్రత్యర్థులుగా రాజకీయాల్లో కొనసాగారు. మారిన పరిస్థితుల కారణంగా ఇద్దరు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పార్టీ అధిష్టానం అండదండలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రోహిత్ రెడ్డి వ్యవహరించిన తీరు రోహిత్ రెడ్డిపై పార్టీ సానుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఆయన బీజేపీలో చేరుతారని విస్తృత ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రెచ్చిపోతే మహేందర్ రెడ్డి వేరే పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉంది.