ఈ రోజు ఉదయం ఒక దుర్వార్త వినవలసి వచ్చింది. భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో మంత్రి ఎంగోలా మృతి చెందారు. గన్ మెన్ కూడా చనిపోయాడు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఇది దేవుడు రాసిన రాత. ఏం జరిగినా మనం మార్చలేం
ఉగాండాలో (Uganda) దారుణ సంఘటన జరిగింది. తుపాకీ తూటాకు (Gun Fire) ఆ దేశ మంత్రి బలయ్యాడు. జీతం (Salary) ఇవ్వలేదని సొంత గన్ మెన్ (Gunmen) మంత్రిని కాల్చి చంపేశాడు. భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో కేంద్ర మంత్రి అక్కడికక్కడే చనిపోయాడు. కాల్పులు జరిపిన అనంతరం గన్ మెన్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉగాండాలో సంచలనంగా మారింది.
ఉగాండా కార్మిక శాఖ సహాయ మంత్రిగా రిటైర్డ్ కల్నల్ చార్లెస్ ఎంగొలా (Charles Okello Engola) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజధాని కంపాలాలో (Kampala) మంత్రి నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం మంత్రి నివాసంలో చార్లెస్ ఎంగోలాతో బాడీగార్డ్ గొడవపడ్డాడు. తన జీతం విషయమై వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో క్షణికావేశానికి లోనైన గన్ మెన్ (BodyGuard) ఎంగోలాపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన మంత్రి అక్కడికక్కడే కన్నుమూశాడు. అనంతరం ఆ దుండగుడు మంత్రి నివాసంలో కలియ తిరిగాడు. పలు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా, పార్లమెంట్ సమావేశాలు (Parliament Session) జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. ఎంగోలా హత్యపై పార్లమెంట్ లో స్పీకర్ ప్రకటన చేశారు. ‘ఈ రోజు ఉదయం ఒక దుర్వార్త వినవలసి వచ్చింది. భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో మంత్రి ఎంగోలా మృతి చెందారు. గన్ మెన్ కూడా చనిపోయాడు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఇది దేవుడు రాసిన రాత. ఏం జరిగినా మనం మార్చలేం’ అని స్పీకర్ (Speaker ప్రకటించారు.