రజనీకాంత్ పై తీవ్ర విమర్శలు చేశారు. మరింత దిగజారి వ్యక్తిగత దూషణలకు దిగడం వైసీపీ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనం. రజనీపై విమర్శలు చేయడంతో తెలుగు ప్రజలతో పాటు తమిళనాడు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై విమర్శించలేదు.. సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పాలనపై విమర్శలు చేయలేదు.. వారిని ఒక్క మాట అన్నది లేదు. అయినా కూడా ఏపీ మంత్రులు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ఉలిక్కిపడ్డారు. ఏదో ఉపద్రవం మీద పడ్డట్టు వెంటనే మీడియా ముందుకు వచ్చేసి భారత సినీ పరిశ్రమలోనే దిగ్గజ నటుడు అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పై తీవ్ర విమర్శలు చేశారు. మరింత దిగజారి వ్యక్తిగత దూషణలకు (Personal Attack) దిగడం వైసీపీ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనం. రజనీపై విమర్శలు చేయడంతో తెలుగు ప్రజలతో పాటు తమిళనాడు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్, వైసీపీ నాయకులు రజనీకాంత్ కు క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైంది. ఈ విమర్శలను తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఖండించింది. తాజాగా రజనీకాంత్ కు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విమర్శలను పట్టించుకోవద్దని హితవు పలికారు.
విజయవాడలో (Vijayawada) ఏప్రిల్ 28వ తేదీన జరిగిన ఎన్టీఆర్ (NT Rama Rao) శత జయంతి ఉత్సవాల్లో రజనీకాంత్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సయమంలో చంద్రబాబును పొగుడుతూ.. రజనీ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబును ప్రశంసించడాన్ని వైసీపీ సహించలేదు. వెంటనే మంత్రులు, వైసీపీ నాయకులు విమర్శలు చేశారు. ఈ విమర్శలను ఖండించిన చంద్రబాబు నాయుడు రజనీకి వైసీపీ నాయకులు, సీఎం జగన్ క్షమాపణలు (Apology) చెప్పాలని డిమాండ్ చేశాడు. అయితే దారుణంగా విమర్శలు చేయడంపై చంద్రబాబు స్పందించారు. రజనీకాంత్ కు మంగళవారం ఫోన్ చేశారు. ‘మీరు కొన్ని మంచి మాటలు చెప్పినా వైఎస్సార్ సీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. మీపై వారు విమర్శలు చేయడం విచారకరం. నేను చాలా బాధపడుతున్నా. అవేమీ పట్టించుకోకండి’ అని రజనీతో చంద్రబాబు చెప్పారు.
అనంతరం రజనీ స్పందిస్తూ.. ‘విమర్శలను నేను పట్టించుకోవడం లేదు. వాటిని తేలికగా తీసుకుంటున్నా. అయినా ఉన్న విషయాలే చెప్పా. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా లెక్క చేయను. నేను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నా. నా అభిప్రాయం మారదు’ అని ఫోన్ కాల్ లో (Phone Call) చెప్పినట్లు సమాచారం.