»Karnataka Elections 2023 Dk Shivakumars Chopper Suffers Bird Hit
DK Shivakumarకు తప్పిన పెను ప్రమాదం.. హెలికాప్టర్ ను ఢీకొట్టిన గద్ద
ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గద్ద ఢీకొట్టింది. వేగంగా గద్ద ఢీకొట్టడంతో హెలికాప్టర్ అద్దం పగిలిపోయింది. వెంటనే అత్యవసరంగా హెలికాప్టర్ ను కిందకు దించారు. ఈ సంఘటన కర్ణాటకలో సంచలనంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ కర్ణాటకలో (Karnataka) ఓ సంఘటన తీవ్ర కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక (కేపీసీసీ) రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్ (DK Shivakumar) త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ (Helicopter) గద్ద ఢీకొట్టింది. వేగంగా గద్ద ఢీకొట్టడంతో హెలికాప్టర్ అద్దం (Mirror) పగిలిపోయింది. వెంటనే అత్యవసరంగా హెలికాప్టర్ ను కిందకు దించారు. ఈ సంఘటన కర్ణాటకలో సంచలనంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ అధ్యక్షుడిగా శివకుమార్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం బెంగళూరులో (Bengaluru) పార్టీ మేనిఫెస్టో (Manifesto) విడుదల చేసిన అనంతరం ప్రచారానికి హెలికాప్టర్ లో బయల్దేరారు. జక్కూర్ నుంచి కోలార్ లోని ముల్ బగిలు అనే ప్రాంతానికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో వెళ్తున్నారు. ఆకాశంలో ఉండగా అకస్మాత్తుగా గద్ద దూసుకొచ్చి హెలికాప్టర్ ను ఢీకొట్టింది.
ఈ ఘటనతో చాపర్ (Choper)లోని శివ కుమార్ తో పాటు ఇతర పార్టీ నాయకులు భయాందోళన చెందారు. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్ట్ (HAL Airport)లో సురక్షితంగా హెలికాప్టర్ ను దించారు. అద్దం పగిలినా కూడా 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి సురక్షితంగా హెలికాప్టర్ దిగడంతో కాంగ్రెస్ పార్టీ (Congress Party) నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. దిగిన అనంతరం శివ కుమార్ హెలికాప్టర్ ను పరిశీలించారు.