»New Delhi Union Minister G Kishan Reddy Health Stable Under Observation At Aiims
Kishan Reddy అస్వస్థతకు గురైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఏమైందంటే..?
అతడి ఆరోగ్య పరిస్థితిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అతడి పరిస్థితి విషమంగా ఉందనే ప్రచారం జరిగింది. అయితే అవన్నీ అవాస్తవమని వైద్యులు తేల్చి చెప్పారు.
తెలంగాణకు చెందిన కీలక నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా ఆస్పత్రిలోనే (Hospital) చికిత్స పొందుతున్నారు. అయితే అతడి ఆరోగ్య పరిస్థితిపై (Health Condition) అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అతడి పరిస్థితి విషమంగా ఉందనే ప్రచారం జరిగింది. అయితే అవన్నీ అవాస్తవమని వైద్యులు (Doctors) తేల్చి చెప్పారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో (Chest Pain) బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS)లో చేరారు. గ్రాస్ ట్రబుల్ తోనే ఆయనకు నొప్పి వచ్చిందని.. చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. పొత్తి కడుపు ఎగువ భాగంలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. అన్ని పరీక్షలు నిర్వహించామని.. చికిత్స అందించడంతో కిషన్ రెడ్డి కోలుకుంటున్నారని వైద్యులు వివరించారు. అతడి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని.. ఎవరూ ఆందోళన (No Tension) చెందాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి కుటుంబసభ్యులు, సన్నిహితులు మీడియాకు తెలిపారు.