యుగాండా (Uganda) దేశంలో డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటోన్న పురుషుల సంఖ్య పెరిగిందని నివేదికలు వస్తున్నాయి.ఈ పరీక్షల వల్ల కాపురాలు కూలిపోతున్నాయి.అధిక సంఖ్యలో భార్యలు ఉండటంతో మహిళలు వివాహేతర సంబంధాలు న్యూస్పేపర్ కథనం ప్రచురించింది. యుగాండా బిజినెస్ టైకూన్ (Business tycoon) ఒకరు తన భాగస్వాముల్లో ఒకరితో గొడవపడి.. ఆమె సంతానం తనతో కలిగినవారేనా అనేది తెలుసుకునేందుకు డీఎన్ఏ టెస్ట్ (DNA test) చేయించుకున్నట్లు మీడియాలో వచ్చింది.అప్పటి నుంచి ఈ పితృత్వ పరీక్షల వ్యవహారం యుగాండాలో చర్చనీయంగా మారింది.ఈ పితృత్వ పరీక్ష(Paternity test)లో ఆయన 25 మంది పిల్లల్లో కేవలం 15 మంది మాత్రమే ఆయనకు పుట్టినట్లు తేలిందని న్యూస్ రాశారు. ఈ కథనంపై అటు ఆ బిజినెస్ టైకూన్ కానీ, ఆయన కుటుంబం కానీ బహిరంగంగా ఎలాంటి కామెంట్ చేయలేదు.
డీఎన్ఏ పరీక్షలు చేయించుకుని పిల్లల్ని, కుటుంబాలను వేదనకు గురిచేయొద్దని, ఇలాంటి పరీక్షలకు దూరంగా ఉండాలని పురుషులను కొందరు చట్టసభల సభ్యులు కోరుతున్నారు.మన పూర్వీకులులాగా నివసించండి. ఇంట్లో పుట్టిన ప్రతి శిశువు కూడా మీ పిల్లలే’’ అని పార్లమెంట్లో ఖనిజాభివృద్ధి శాఖ మంత్రి సారా ఓపెన్ది తెలిపారు. ఒకవేళ పురుషుడు డీఎన్ఏ పరీక్షను చేయించుకోవాలనుకుంటే, శిశువు పుట్టిన వెంటనే చేయించుకోవాలని.. వారు పెరిగినప్పుడు కాదని చెప్పారు.అత్యంత ఆందోళనకర విషయం ఏంటంటే, ఈ పరీక్షలు గృహహింసకు కారణమవుతున్నాయని మానిటర్ న్యూస్పేపర్ రిపోర్ట్ చేసింది.యుగాండాలో నివసిస్తోన్న ఒక ఇజ్రాయిల్ (Israel) దేశస్తుడు ఆరు నెలల బిడ్డకు తండ్రి తాను కాదని డీఎన్ఏ పరీక్షల్లో తేలిన తర్వాత తన భార్యను కిరాతంగా చంపేశాడు. ఆయన్ను యుగాండా పోలీసులు అరెస్ట్ చేశారు.