»Antony Blinken The Israel Hamas War Risks Escalating
Antony Blinken: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇంకా విస్తరించే ప్రమాదముంది
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా విస్తరించే ప్రమాదం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ హెచ్చరించారు. ఇది పశ్చిమాసియా ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పు కలగజేస్తుందని చెప్పారు.
Antony Blinken: గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా విస్తరించే ప్రమాదం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ హెచ్చరించారు. ఇది పశ్చిమాసియా ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పు కలగజేస్తుందని చెప్పారు. లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్బొల్లా సైతం ఇజ్రాయెల్‌పై దాడులు జరుగుతున్నాయి. అక్కడ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నంలో అక్కడ ఆయన పర్యటన నేపథ్యంలో వ్యాఖ్యలు చేశారు. బ్లింకెన్ జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో పాటు ఖతర్ ప్రధానమంత్రి షేక్ అబ్దుల్ రహమాన్ అల్ థానితో చర్చలు జరిపారు.
హమాస్ ఉపనేత సలేహ్ అరౌరీని లెబనాన్ రాజధాని బీరుట్‌లోనే ఇజ్రాయెల్ హతమార్చిన నేపథ్యంలో బందీల విడుదల ప్రక్రియలో జాప్యం జరిగే అవకాశం ఉందని బ్లింకెన్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఖతర్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఇజ్రాయెల్ దాడి వల్లే అరౌరీ మృతి చెందాడని.. దీనికి ప్రతీకారంగానే శనివారం ఎదురుదాడి చేశామని హెజ్బొల్లా ప్రకటించింది. అయితే, హమాస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న హెజ్బొల్లాపై ఒత్తిడి పెరిగిందని ఇజ్రాయెల్ త్రిదళాధిపతి లెఫ్టినెంట్ కర్నల్ హెర్జ్వీ హలేవీ తెలిపారు. దీంతో అది యుద్ధంలో నేరుగా పాల్గొనాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నారు. ఫలితంగా మరో యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.